వైసీపీకి ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా

వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

Advertisement
Update:2024-01-10 18:08 IST

వైసీపీకి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన రెండు రోజుల్లో లోక్ సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు.

బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో కొనసాగుతానని చెప్పారు.

ఇటీవల సంజీవ్ కుమార్‌ను కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్‌ను మంత్రి జయరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకిక టికెట్ దక్కే అవకాశం లేదని భావించిన సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News