జగన్ డీఎన్ఏ సీమది.. లోకేష్ డీఎన్ఏ తెలంగాణది

ఎన్టీఆర్ కొడుకులు సామాన్యులుగా బతుకుతుంటే, చంద్రబాబుకి మాత్రం అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఆస్తి మొత్తం చంద్రబాబుకే రాసిచ్చారా అని అడిగారు.

Advertisement
Update:2023-02-17 20:56 IST

జగన్ లో రాయల సీమ డీఎన్ఏ ఉందని, నారా లోకేష్ డీఎన్ఏ మాత్రం తెలంగాణది అని అన్నారు మంత్రి కొడాలి నాని. సీమ బిడ్డను అని లోకేష్ చెప్పుకోవడం హాస్యాస్పదం అని సెటైర్లు వేశారు నాని. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి, లోకేష్ ఇక్కడ యాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ ఒక అజెండా అంటూ లేకుండానే యాత్ర చేస్తున్నారని చెప్పారు.

యాత్రకు నో రెస్పాన్స్..

లోకేష్‌ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టిందని అన్నారు కొడాలి నాని. సీఎం జగన్ ని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా, నేను మాట్లాడితే బూతులు అంటారా..? అంటూ మండిపడ్డారు నాని.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదని, ఏపీకి పట్టిన దరిద్రం చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తాను బూతులు మాట్లాడతాను అనే వారికి.. చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడే మాటలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు నాని.

ఆస్తి అంతా నీకే రాసిచ్చారా..?

ఎన్టీఆర్ కొడుకులు సామాన్యులుగా బతుకుతుంటే, చంద్రబాబుకి మాత్రం అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఆస్తి మొత్తం చంద్రబాబుకే రాసిచ్చారా అని అడిగారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని, పేదలను, రైతులను మోసం చేసిన 420 అని అన్నారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబే అసలైన సైకో అని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News