జగన్ కు 'మూడు' ఎలాగైనా ఓకేనా..?

అమరావతి అంశం జగన్ కు మంచి ఆయుధంగా మారబోతున్నాయనే చర్చ వైసీపీలో జోరందుకుంటోంది. ఎలాగంటే ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉన్న ఈ అంశంపై మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పిస్తే జగన్ కు బాగా ప్ల‌స్ అవుతుంది.

Advertisement
Update:2022-12-07 11:10 IST

వచ్చే ఎన్నికల్లో ఇటు జగన్మోహన్ రెడ్డికి అటు చంద్రబాబు నాయుడుకు రెడీమేడ్ గా కీలకమైన అంశం ఒకటి చేతిలో ఉంది. అదేమిటంటే రాజధాని వివాదం. జగన్ ఏమో మూడు రాజధానులను ప్రతిపాదించారు. అలాగే చంద్రబాబేమో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇటు వైసీపీ అటు టీడీపీ లేదా అన్నీ ప్రతిపక్షాలు కావచ్చు రాజధాని అంశాన్నే కీలకంగా ప్రస్తావించబోతున్నాయి. అంటే అమరావతి కేంద్రంగానే ఎన్నికలు జరగబోతున్నాయన్నది వాస్తవం.

సరిగ్గా ఇక్కడే అమరావతి అంశం జగన్ కు మంచి ఆయుధంగా మారబోతున్నాయనే చర్చ వైసీపీలో జోరందుకుంటోంది. ఎలాగంటే ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉన్న ఈ అంశంపై మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పిస్తే జగన్ కు బాగా ప్ల‌స్ అవుతుంది. మూడు రాజధానులను సాధించిన నేతగా జగన్ కు పై ప్రాంతాల్లో ఇమేజ్‌ పెరిగిపోతుందని అనుకుంటున్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉత్తరాంధ్రలో, కర్నూలు న్యాయరాజధానిగా రాయలసీమలో పార్టీకి మంచి ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. కాకపోతే శాసనరాజధాని ఉండే జిల్లాలైన కృష్ణా, గుంటూరు పరిస్ధితి ఏమిటో ఆలోచించాలట.

ఇదే సమయంలో ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు ఆలస్యమైనా లేక జగన్ కు వ్యతిరేకంగా వచ్చినా దాన్ని కూడా జగన్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశముందని సమాచారం. ఎలాగంటే రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమను డెవలప్ చేద్దామని అనుకుంటే చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా అడ్డుకున్నదని జగన్ ఆరోపణలు చేస్తారు. దాన్ని కౌంటర్ చేయటానికి చంద్రబాబు అండ్ కో దగ్గర ఏమీవుండదు. ఎందుకంటే విశాఖ, కర్నూలును చంద్రబాబు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం బహిరంగమే కాబట్టి. అసలు కోర్టుతో సంబంధమే లేకుండా పార్లమెంటు ద్వారా రాజధానుల ఏర్పాటులో చట్టంలో సవరణలు చేయించుకోగలిగినా జగన్ కు ప్లస్సే అవుతుందని పార్టీనేతలు అనుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News