దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు.. మాజీ మంత్రి కన్నబాబు

చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రవాసాంధ్రుల మాదిరిగా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు హైదరాబాద్లో ఉంటూ ఏపీలో గెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement
Update:2023-02-17 19:11 IST

దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో తాగడానికి నీరులేక, ప్రాజెక్టులు నిండక, కరువు విలయతాండవం చేసిందని గుర్తుచేశారు. 2004కు ముందు కూడా చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అల్లాడిందన్నారు. చంద్రబాబు పాదం మోపితేనే కరువు, కాటకాలు, ప్రజల కష్టాలు తప్ప.. ఏనాడైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. తాడేపల్లి లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు అంటేనే దరిద్రంబాబు అని జనాలు ఫిక్సైపోయి 2019లో తీర్పు ఇచ్చారని మాజీ మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత 2019 నుంచి వానలు పుష్కలంగా కురిశాయని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయన్నారు. ప్రాజెక్టుల గేట్లు కూడా కొట్టుకుపోయేలా వరుణుడు కరుణించాడని, దీన్ని అదృష్టం అంటారని చెప్పుకొచ్చారు.

జగన్ అంటే జనానికి అదృష్టం, టీడీపీ అంటే దరిద్రం అని కుర‌సాల క‌న్న‌బాబు అన్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో పట్టుమని 10 ఎంపీటీసీలు గెలవలేకపోయింద‌ని, తెలుగుదేశం పార్టీ ఇంకా ఇంకా దరిద్రంతో క్షీణించిపోతుందన్నారు.

చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రవాసాంధ్రుల మాదిరిగా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తండ్రీకొడుకులు హైదరాబాద్లో ఉంటూ ఏపీలో గెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఇళ్లు కట్టుకుని రాజకీయాలు చేయాలని, ఏకంగా టీడీపీ కార్యకర్తలే చంద్రబాబు ముఖం పట్టుకుని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు.

నారా లోకేష్ తన పప్పు బ్రాండింగ్ నుంచి బయటపడేందుకు బూతులతో రెచ్చిపోతున్నాడని విమర్శించారు. ప్రజల్లో గెలవలేని లోకేష్ ఎక్కడా? ఒంటిచేత్తో 151మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగన్ ఎక్కడా.. అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News