బాబు లాంటోడి గురించి భారతంలోనే చెప్పారు

చంద్రబాబుకు ఉన్న జబ్బు గురించి భారతంలోనే చెప్పారన్నారు. ఇలాంటి వ్యాధి ఉన్న వారు రాజ్యాన్ని ఏలితే రాజ్యానికి కూడా దరిద్రం పడుతుందని అప్పట్లో చెప్పారన్నారు.

Advertisement
Update:2023-02-17 09:49 IST

చంద్రబాబు నిత్య దరిద్రుడని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబు వస్తే వర్షాలు కూడా ఉండవన్నారు. ఈ విషయం ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పుట్టుకతోనే దరిద్రమని.. ఆయన పెరిగే కొద్దీ దరిద్రం కూడా పెరిగిందన్నారు. చంద్రబాబు వస్తే తాగేందుకు మంచి నీరు ఉండవని కాబట్టి ఆయన్ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు.

2014లో మోడీ, పవన్ కల్యాణ్ ఓట్ల సాయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తానో పోటుగాడిని, కత్తి రాందాసుని అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఉంటే ప్రకృతి కూడా సహకరించదని గుర్తించే.. ఒంగి ఒంగి దండం పెట్టినా ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఫుట్‌బాల్‌ను తన్నినట్టుగా తన్నారన్నారు. చంద్రబాబుకు ఉన్న జబ్బు గురించి భారతంలోనే చెప్పారన్నారు. ఇలాంటి వ్యాధి ఉన్న వారు రాజ్యాన్ని ఏలితే రాజ్యానికి కూడా దరిద్రం పడుతుందని అప్పట్లో చెప్పారన్నారు. పాండురాజుకు రాజ్యం అప్పగించకపోవడానికి కారణం ఆ జబ్బేనన్నారు.

ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌, జగన్, ఇతర ముఖ్యమంత్రుల హయాంలో వర్షాలు బాగా పడేవని.. ఒక్క చంద్రబాబు అధికారంలో ఉంటే మాత్రమే ఎందుకు వర్షాలు రావడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి దరిద్రుడైన చంద్రబాబు.. జగన్‌ను ఉద్దేశించి దరిద్రుడు అనడం ఏమిటన్నారు. చంద్రబాబు కుటుంబంలో ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరికి మైండ్ దెబ్బతిన్నదని.. చంద్రబాబుది కూడా అదే పరిస్థితి అన్నారు. పిచ్చి అన్నది చంద్రబాబు వంశంలోనే, డీఎన్‌ఏలోనే ఉందన్నారు.

చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందన్నారు. మైకుల ముందు మాట్లాడే వారు వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలన్నారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సీఎం రమేష్‌ను విచారణకు పిలిచి బట్టలూడదీసి కొడితే జరిగిందంతా బయటకు వస్తుందన్నారు. 2024 తర్వాత చంద్రబాబును గొలుసులేసి గదిలో కట్టేయాల్సి ఉంటుందన్నారు కొడాలి.

Tags:    
Advertisement

Similar News