అది టీడీపీకి ఇచ్చేశారు కాబట్టి ఇది మనదే.. జనసేన నేతల ఆశలు
తణుకు టికెట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించింది. ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని, ఈసారి కచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు.
టీడీపీ, జనసేన పొత్తులో నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి 99 సీట్లు ప్రకటించారు. అయితే జనసేనకు కేటాయించిన 24 సీట్లలో 5 స్థానాలకే అభ్యర్థులను వెల్లడించారు. దీంతో ఇంకా 19 స్థానాల్లో తమకో సీటు దక్కకపోతుందా అని గ్లాస్ పార్టీ నేతలు ఆశల మేడలు కట్టేస్తున్నారు. మన పక్క సీటు టీడీపీకి ఇచ్చారు కాబట్టి ఈ సీటు మన పార్టీకే ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారు.
పశ్చిమగోదావరిలో లెక్కలివీ..
తణుకు టికెట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించింది. ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేకపోయానని, ఈసారి కచ్చితంగా న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆరిమిల్లికి టీడీపీ టికెటివ్వడంతో విడివాడ ఆశలు గల్లంతయ్యాయి. అయితే పక్కనే ఉన్న తాడేపల్లిగూడెంలో జనసేన ఆశావహుడు బొలిశెట్టి శ్రీను ఇది తనకు ప్లస్‌పాయింట్ అని భావిస్తున్నారు. పక్కపక్క నియోజకవర్గాలు జనసేనకు ఇచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి తణుకు విడివాడకు ఇస్తే గూడెం పక్కాగా టీడీపీకి ఇచ్చేవారు. ఇప్పుడు తనకు లైన్‌క్లియర్ అయిందని బొలిశెట్టి భావిస్తున్నారు. అలాగే పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడికి టికెట్ ఇచ్చారు కాబట్టి పక్కనే ఉన్న నరసాపురం టికెట్ తమకు ఖాయమని ఇక్కడ సీటు ఆశిస్తున్న జనసేన నేత బొమ్మిడి నాయకర్ ధీమాగా ఉన్నారు.
ఉమ్మడి కృష్ణాలో ఆశలివీ..
విజయవాడ సెంట్రల్, ఈస్ట్ సీట్లు రెండూ టీడీపీ తీసుకుంది. బొండా ఉమ, గద్దె రామ్మోహన్‌కు సీట్లు దక్కాయి. దీంతో తనకు రూట్ క్లియర్ అయిందని విజయవాడ వెస్ట్‌లో జనసేన నాయకుడు పోతిన మహేష్ సంబరపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో.. ఆయన్ను నడిపించే అసలు డైరెక్టర్ చంద్రబాబు మనసులో ఏముందో!