ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు.. బాబుపై జగన్ పంచ్ లు

చంద్రబాబు హామీలు వింటుంటే అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడని, సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్.

Advertisement
Update:2023-06-01 15:16 IST

ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు.. బాబుపై జగన్ పంచ్ లు

చంద్రబాబుపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్. అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడని ఎద్దేవా చేశారు. ఆయనకు ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ అంతకన్నా లేదన్నారు. ఆఖరికి పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా ఆయనకు కరువయ్యారని సెటైర్లు పేల్చారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారతారని, ఏ గడ్డైనా తింటారని కౌంటర్ ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా నిధులు విడుదల చేసిన జగన్, మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

మళ్లీ ఎందుకు ఒక్క ఛాన్స్..

ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏం చేశాడో చెప్పుకునే ధైర్యం లేదు కానీ మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటూ చంద్రబాబు ప్రజల వద్దకు వస్తున్నారని చెప్పారు సీఎం జగన్. సీఎంగా మొదట చేసే సంతకానికి ఓ క్రెడిబులిటీ ఉంటుందని, కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారని ఆరోపించారు. మంచి చేయడం చంద్రబాబు డిక్షనరీలోనే లేదన్నారు. ఆయనకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులేనని చెప్పారు. గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటమే.. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికి వారు చేసేది పోరాటమేనన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే తమ పార్టీని మళ్లీ ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు జగన్.


Full View

మారీచుడు, రావణుడు..

రైతులకు శత్రువు చంద్రబాబేనని, రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారని మండిపడ్డారు సీఎం జగన్. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి చంపేసి, మళ్లీ ఆయన్నే కీర్తించారని అన్నారు. చంద్రబాబు హామీలు వింటుంటే అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడని, సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడని ఎద్దేవా చేశారు.

మేనిఫెస్టోలో ప్రకటించినదానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు సీఎం జగన్. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,900 కోట్ల రూపాయలకు పైగా నిధులు జమ చేశామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇప్పటివరకు రూ.54 వేలు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు.

Tags:    
Advertisement

Similar News