పొత్తు లేనట్లే..! - చంద్రబాబు, పవన్‌కు బిగ్ షాక్

ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ నేతలతో జాతీయనేత శివప్రకాశ్‌ పొత్తుపై దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Advertisement
Update:2024-03-01 18:34 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్‌ రోజురోజుకు పెరుగుతోంది. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా.. లేదా అన్నదానిపై జనాల్లో ఆసక్తి ఉంది. అలాగే బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని టీడీపీ, జనసేన కూటమి తెగ ఉవ్విల్లూరుతోంది. 2014 ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని.. జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తామని కలలు కంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బీజేపీ అధిష్టానం. టీడీపీ, జనసేనతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పొత్తు అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ నేతలతో జాతీయనేత శివప్రకాశ్‌ పొత్తుపై దాదాపుగా క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. సీట్ల ప్రకటన విషయంలో చంద్రబాబు తీరుతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడ్డట్లు చర్చ జరుగుతోంది. సర్వేలన్నింటిలో వైసీపీ వస్తుందని చెబుతుండటంతో పొత్తుపై ఢిల్లీ బీజేపీ పెద్దలు వెనక్కి తగ్గారని టాక్. మరో పక్క ఎన్డీయేలో చేరే అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేనందునే బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.

ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో టికెట్ రాని ఆశావహులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ దక్కని వారు 20 నుండి 30మంది వరకు బీజేపీతో టచ్‌లో ఉన్నారని టాక్. వాళ్లందరినీ పార్టీలో చేర్చుకుంటే 15 శాతం ఓట్ షేర్ సంపాదించవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇలాంటి మంచి ఛాన్స్ ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు బలాన్ని పెంచటం ఎందుకని బీజేపీ భావిస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలని బీజేపీ నిర్ణయించినట్లు టాక్. రేపో, మాపో దీనిపై అధికారిక ప్రకటన చేసి చంద్రబాబు, పవన్‌లకు గట్టి షాక్ ఇవ్వబోతోంది బీజేపీ అధిష్టానం.

Tags:    
Advertisement

Similar News