ప్లాస్టిక్‌ నిర్మూలనతోనే భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం

అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపు

Advertisement
Update:2024-10-07 18:12 IST

పర్యావరణాన్ని పరిరక్షించి, జీవ వైవిధ్యాన్ని కాపాడినప్పుడే 'వసుధైక కుటుంబం' అనే పేరు సార్థకమవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో నిర్వహించిన 70వ వన్యప్రాణి వారోత్సవాల ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. వారోత్సవాల్లో భాగంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలను ఆసక్తిగా చూశారు. సముద్ర తాబేళ్ల రక్షణ కోసం రూపొందించిన మెరైన్‌ ఫానా యాప్‌ను పవన్‌ ప్రారంభించారు. కింగ్‌ కోబ్రాల సంరక్షణ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. వన్యపాణి వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన వారికి పవన్‌ బహుమతులు అందించారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణ అందించాలంటే ప్రజలంతా ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని పవన్‌ సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి అందరూ కృషి చేయాలన్నారు.

Tags:    
Advertisement

Similar News