అవినాష్ రెడ్డి ఎపిసోడ్.. తేలేది నేడే

అవినాష్ రెడ్డి అరెస్ట్ కి సీబీఐ సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో సీబీఐ ముందడుగు వేస్తుంది.

Advertisement
Update:2023-05-25 08:40 IST

వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా..? ఆయన్ను పదే పదే విచారణకు పిలుస్తోంది సీబీఐ, వివిధ కారణాలతో రాలేనని చెబుతున్నారు అవినాష్ రెడ్డి. ఈ మధ్యలో మీడియా హడావిడి, మీడియాపై అవినాష్ రెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్నవారి దాడి, రాజకీయ పార్టీల హాట్ స్టేట్ మెంట్లు, సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లు.. ఇలా సాగుతోందీ వ్యవహారం. అయితే ఈ ఎపిసోడ్ కి ఈరోజు ఫుల్ స్టాప్ పడే అవకాశముంది. నేడు తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనేది తేలిపోతుంది.

తన బెయిల్ పిటిషన్ విచారణను, తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ తేల్చాలని అవినాష్ రెడ్డి చేసిన అభ్యర్థనను.. సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈరోజు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. దీనిపై వెకేషన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో మాదిరిగానే మరోసారి ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేక ఈసారి సీబీఐకి అనుకూలంగా ఉత్తర్వులిస్తుందా అనేది వేచి చూడాలి.

కోర్టు నిర్ణయంతో..

మూడుసార్లు అవకాశాలిచ్చినా అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో.. సీబీఐ అధికారులు నేరుగా పులివెందులకు వెళ్లడం, ఆ తర్వాత కర్నూలు ఆస్పత్రికి వెళ్లడం, జిల్లా ఎస్పీని కలసి అవినాష్ రెడ్డి అరెస్ట్ పై చర్చించడం సంచలనంగా మారింది. దాదాపు అవినాష్ రెడ్డి అరెస్ట్ కి సీబీఐ సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కోర్టు నిర్ణయంతో సీబీఐ ముందడుగు వేస్తుంది. 

Tags:    
Advertisement

Similar News