టీడీపీ రౌండ్‌టేబుల్‌లో లక్ష్మణ్ రెడ్డి.. జగన్‌పై విమర్శలు
అక్కడే జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. జగన్ మద్యాన్ని నిషేధిస్తానని చెబితే ఆ మాటలు తాను నమ్మి మద్య విమోచన కమిటీ చైర్మన్ పదవి తీసుకున్నానని చెప్పారు. ఇలా చేస్తారని తెలిసి ఉంటే పదవే తీసుకునే వాడిని కాదన్నారు.
మొన్నటి వరకు ఏపీ మద్య విమోచన కమిటీ చైర్మన్‌గా పనిచేసిన లక్ష్మణ్ రెడ్డి స్వరం మార్చారు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ కూడా చేయని విమర్శలు ఆయన చేశారు. రెండేళ్ల పదవీకాలంతో 2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం లక్ష్మణ్ రెడ్డిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించింది. రెండేళ్ల పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన మాజీ అయ్యారు. లక్ష్మణ్ రెడ్డి ఇప్పుడు టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ''స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం- సేవ్ డెమోక్రసీ'' రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు.
అక్కడే జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. జగన్ మద్యాన్ని నిషేధిస్తానని చెబితే ఆ మాటలు తాను నమ్మి మద్య విమోచన కమిటీ చైర్మన్ పదవి తీసుకున్నానని చెప్పారు. ఇలా చేస్తారని తెలిసి ఉంటే పదవే తీసుకునే వాడిని కాదన్నారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో రెండు లక్షల బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణ చేసేందుకు ఇప్పటి వరకు టీడీపీ కూడా సాహసించలేదు. ఒక్కో గ్రామంలో ఏడు నుంచి 10 వరకు బెల్ట్ షాపులున్నాయని లక్ష్మణ్ రెడ్డి ఆరోపించారు. నిజానికి ఇది ఊహకందని ఆరోపణే. ఎక్కడో ఒకటి రెండు బెల్ట్ షాపులు ఉండవచ్చు గానీ.. రెండు లక్షల బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటే టీడీపీ, ఆ పార్టీ మీడియా రచ్చ చేయకుండా ఉండేదా..?
మరి ఎక్కడ తేడా వచ్చిందే గానీ లక్ష్మణ్ రెడ్డి చాలా పెద్ద ఆరోపణే చేశారు. టీడీపీ మీడియా ఇకపై లక్ష్మణ్ రెడ్డిని పిలిచి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చలు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.