చంద్రబాబు తీరుపై హైకోర్టు అసహనం
చంద్రబాబుకు ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదని కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే అన్న విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేసింది. రాజకీయ సభల్లో, ర్యాలీల్లో పాల్గొంటారని బెయిల్ పిటీషన్లోనే ప్రస్తావించి ఉంటే బెయిల్ ఉత్తర్వులు మరోరకంగా ఉండేవని మండిపడింది.
మధ్యంతర బెయిల్‌పై రిలీజైన చంద్రబాబు తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మెడికల్ బెయిల్‌పై రిలీజైన చంద్రబాబు రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనటం ఏమిటని నిలదీసింది. చంద్రబాబు మధ్యంత బెయిల్‌పై మరిన్ని కండీషన్లు పెట్టాలనే సీఐడీ అభ్యర్థనపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణలో రెండు వైపుల లాయర్ల వాదనలు విన్న హైకోర్టు ఒక విధంగా సమతుల ఆదేశాలు ఇచ్చినట్లే అనుకోవాలి. అంటే కోర్టు ఆదేశాలు రెండు వైపులా సమానంగా ఉన్నాయనే అనుకోవాలి.
విషయం ఏమిటంటే చంద్రబాబును వెన్నంటి ఉండేట్లుగా ఇద్దరు డీఎస్పీలను నియమించాలని సీఐడీ అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. ఇదే సమయంలో చంద్రబాబు లాయర్ల మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబుకు ఇచ్చింది రెగ్యులర్ బెయిల్ కాదని కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే అన్న విషయాన్ని మరచిపోవద్దని గుర్తు చేసింది. రాజకీయ సభల్లో, ర్యాలీల్లో పాల్గొంటారని బెయిల్ పిటీషన్లోనే ప్రస్తావించి ఉంటే బెయిల్ ఉత్తర్వులు మరోరకంగా ఉండేవని మండిపడింది.
కోర్టు వ్యాఖ్యలను బట్టి మెడికల్ బెయిల్ ఇచ్చుండేవాళ్ళం కాదన్నట్లుగా అర్థంచేసుకోవాలి. బెయిల్ పిటీషన్లో ఒకటి చెప్పి జైలు నుండి రిలీజ్ కాగానే అందుకు విరుద్ధంగా చేయటం ఏమిటని ప్రశ్నించింది. ఇదేసమయంలో తనను కలవటానికి వచ్చే జనాలను చంద్రబాబు నియంత్రించలేరన్నవాదనతో కోర్టు ఏకీభవించింది. తనను చూడటానికి వచ్చిన వాళ్ళని కలవచ్చు కానీ బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని మరోసారి కోర్టు చంద్రబాబు లాయర్లకు గుర్తుచేసింది. చంద్రబాబుకు కండీషనల్ మెడికల్ బెయిల్ ఇచ్చింది కోర్టే కానీ సీఐడీ కాదన్న విషయాన్ని చంద్రబాబు లాయర్లు గుర్తుపెట్టుకోవాలన్నది.
కోర్టు చేసిన వ్యాఖ్యలు, తీర్పుతో ఇరువైపుల సమన్యాయం చేసినట్లుగానే ఉంది. సీఐడీ అడిగినట్లు చంద్రబాబుపై అదనపు ఆంక్షలను కోర్టు అనుమతించలేదు. ఇదే సమయంలో చంద్రబాబు కదలికలపైన, రోజువారి యాక్టివిటీస్ పైనా ఆంక్షలున్నాయన్న విషయాన్ని గుర్తుచేసింది. చంద్రబాబు చేయకూడనివి ఏమిటి, చేయాల్సినవి ఏమిటనే విషయంలో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చినట్లయ్యింది. దాంతో తాజా వ్యాఖ్యలు, తీర్పుతో రెండు వైపులా సమన్యాయం జరిగినట్లుగానే భావించాల్సుంటుంది.
♦