నవంబర్‌ 11న ఏపీ కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్‌

Advertisement
Update:2024-11-09 19:50 IST

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నవంబర్‌ 11న ఏపీ కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నది. 11న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్‌లోనే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించనున్నది. కేబినెట్‌ ఆమోదించిన అనంతరం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు, అంశాలను రాష్ట్ర గవర్నర్‌ మంత్రి పయ్యావుల వివరించారు.

ఈ నెల 11 తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న మూడో అసెంబ్లీ సమావేశాలు ఇవి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. దీంతో ఈసారి సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వ ప్రవేశపెట్టబోతున్నది. మరోవైపు ప్రతి పక్ష హోదా ఇవ్వలేదని గత రెండు సమావేశాలను బహిష్కరించిన వైసీపీ మూడో సమావేశాలకు హాజరు అవుతుందా? లేదా అన్నది చూడాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే హాజరుకాబోమని వైసీసీ అధినేత జగన్‌ అన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో పద్దులమీద చర్చ కూటమి పార్టీ ఎమ్మెల్యే మధ్య జరిగే అవకాశం ఉన్నది. 

Tags:    
Advertisement

Similar News