బాయ్ ఫ్రెండ్ కు లవ్ లెటర్ రాసిన సాయిపల్లవి

హీరోయిన్ సాయిపల్లవిని చూడగానే ఎవరికైనా ప్రేమించేయాలనిపిస్తుంది. అంత క్యూట్ ఫేస్ ఆమెది. మరి సాయిపల్లవే రివర్స్ లో ఓ అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? స్వయంగా అతడికి ప్రేమలేఖ కూడా రాస్తే ఎలా ఉంటుంది? ఇది కథ కాదు, నిజంగా జరిగిన ఘటన. తన రియల్ లైఫ్ ప్రేమకథను బయటపెట్టింది సాయిపల్లవి. “నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నేను 7 లేదా 8వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ లో ఓ అబ్బాయి ఉన్నాడు. చాలా బాగుంటాడు. […]

Advertisement
Update:2022-07-12 05:31 IST

హీరోయిన్ సాయిపల్లవిని చూడగానే ఎవరికైనా ప్రేమించేయాలనిపిస్తుంది. అంత క్యూట్ ఫేస్ ఆమెది. మరి సాయిపల్లవే రివర్స్ లో ఓ అబ్బాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? స్వయంగా అతడికి ప్రేమలేఖ కూడా రాస్తే ఎలా ఉంటుంది? ఇది కథ కాదు, నిజంగా జరిగిన ఘటన. తన రియల్ లైఫ్ ప్రేమకథను బయటపెట్టింది సాయిపల్లవి.

“నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నేను 7 లేదా 8వ తరగతి చదువుతున్నాను. నా స్కూల్ లో ఓ అబ్బాయి ఉన్నాడు. చాలా బాగుంటాడు. అతడికి నేను లవ్ లెటర్ రాశాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. అది అతడికి ఇచ్చేలోపే నా అమ్మానాన్న దాన్ని చూసేశారు. నన్ను చాలా గట్టిగా కొట్టారు.”

ఇలా తన చిన్ననాటి ప్రేమకథను గుర్తుచేసుకుంది సాయిపల్లవి. తను లవ్ లెటర్ రాయడం అదే తొలిసారి, అదే చివరిసారి అని కూడా స్పష్టంచేసింది సాయిపల్లవి. ఆమధ్య పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సాయిపల్లవి. ప్రస్తుతం తనకు పెళ్లిపై ధ్యాస లేదని, ఒకవేళ పెళ్లి చేసుకోవాలని భావించినా, తన కమ్యూనిటీలో అబ్బాయిలు లేరని, అందరికీ చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయిపోయాయని చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు గార్గి అనే డబ్బింగ్ సినిమాతో మరోసారి తెలుగుతెరపైకి వస్తోంది. రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News