వంద కోట్లు పెట్టి ఇల్లు కొన్న స్టార్ హీరో

బాలీవుడ్ హీరోలు ఎక్కువగా ఇళ్లపై పెట్టుబడులు పెడుతుంటారు. ఎంత విలాసవంతమైన ఇల్లు కొనుక్కుంటే అంత రిచ్ గా ఫీల్ అవుతుంటారు. కాకపోతే ముంబయిలో ఇండిపెండెంట్ ఇళ్లు దొరకవు. ఎన్ని కొనుక్కోవాలనుకున్నా అపార్ట్ మెంట్స్ లోనే. అందులోనే విలాసవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. హీరో రణ్వీర్ సింగ్ కూడా అదే పని చేశాడు. ముంబయి బాంద్రా వెస్ట్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు రణ్వీర్. దీని ఖరీదు అక్షరాలా 118 కోట్ల 94 లక్షల రూపాయలు. దీని […]

Advertisement
Update:2022-07-12 06:31 IST

బాలీవుడ్ హీరోలు ఎక్కువగా ఇళ్లపై పెట్టుబడులు పెడుతుంటారు. ఎంత విలాసవంతమైన ఇల్లు కొనుక్కుంటే అంత రిచ్ గా ఫీల్ అవుతుంటారు. కాకపోతే ముంబయిలో ఇండిపెండెంట్ ఇళ్లు దొరకవు. ఎన్ని కొనుక్కోవాలనుకున్నా అపార్ట్ మెంట్స్ లోనే. అందులోనే విలాసవంతమైన ఫ్లాట్లు కొనుగోలు చేస్తుంటారు. హీరో రణ్వీర్ సింగ్ కూడా అదే పని చేశాడు.

ముంబయి బాంద్రా వెస్ట్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు రణ్వీర్. దీని ఖరీదు అక్షరాలా 118 కోట్ల 94 లక్షల రూపాయలు. దీని కోసం ఈ హీరో చెల్లించిన స్టాంప్ డ్యూటీ అక్షరాలా 7 కోట్ల 13 లక్షల రూపాయలు. ఇండెక్స్ టాప్ అనే సంస్థ ఈ మేరకు రణ్వీర్ కొనుగోలు చేసిన పత్రాల్ని బయటపెట్టింది.

రిజిస్ట్రేషన్ విలువ 119 కోట్లు ఉందంటే.. దాని మార్కెట్ విలువ కనీసం 250 కోట్ల రూపాయలు ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. సముద్రం కనిపించేలా కట్టిన అపార్ట్ మెంట్ లో 16, 17, 18, 19 ఫ్లోర్లను రణ్వీర్ దక్కించుకున్నాడు. ఈ 4 అంతస్తుల్లో ప్రత్యేకంగా ఇతడి కోసం ఇల్లు నిర్మించారు. 11,266 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఇది. ఇక 1300 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. రణవీర్ కోసం ఇక్కడ 19 కార్ పార్కింగ్ లు కేటాయించారు.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దీని పక్కనే షారూక్ ఖాన్ నివాసం ఉంది. అలా షారూక్ ఇంటి పక్కకు రణ్వీర్ చేరాడన్నమాట. త్వరలోనే తన భార్య దీపికతో కలిసి ఈ కొత్త ఇంట్లోకి మారబోతున్నాడు రణ్వీర్.

Tags:    
Advertisement

Similar News