ఇంట్లో పోలీస్ యూనిఫామ్ పెట్టుకున్నాను

కొన్ని కథలు కొందరి మనసుకు హత్తుకుంటాయి. వారియర్ కథ కూడా అలా తన మనసుకు హత్తుకుపోయిందంటున్నాడు హీరో రామ్. ఈ కథలో నిజాయితీ తనకు నచ్చిందని, అందుకే లింగుసామి కథ చెప్పి వెళ్లిన రోజు సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించుకున్నానని తెలిపాడు. "ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. 'మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?' అని డైరక్టర్ ను అడిగితే… 'కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను […]

Advertisement
Update:2022-07-12 13:51 IST

కొన్ని కథలు కొందరి మనసుకు హత్తుకుంటాయి. వారియర్ కథ కూడా అలా తన మనసుకు హత్తుకుపోయిందంటున్నాడు హీరో రామ్. ఈ కథలో నిజాయితీ తనకు నచ్చిందని, అందుకే లింగుసామి కథ చెప్పి వెళ్లిన రోజు సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ ఇంటికి తెప్పించుకున్నానని తెలిపాడు.

"ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. 'మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?' అని డైరక్టర్ ను అడిగితే… 'కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా' అని చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జయిట్ చేసిందంటే… లింగుస్వామి నెరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా"

లింగుసామి కంటే ముందు పోలీస్ కథలు 4 విన్నాడట రామ్. కానీ ప్రతి కథలో హీరో-విలన్ మాత్రమే కనిపించారట. అందుకే అన్నింటినీ రిజెక్ట్ చేశాడట. లింగుసామి చెప్పిన కథలో మాత్రం హీరో-విలన్ తో పాటు ఓ ఎమోషన్ కనిపించిందని, అందుకే వెంటనే ఓకే చెప్పానని అన్నాడు.

కథ తనకు అంత బాగా నచ్చింది కాబట్టే తొలిసారి, నెరేషన్ పూర్తయిన వెంటనే ట్వీట్ కూడా చేసినట్టు తెలిపాడు రామ్. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది వారియర్ సినిమా. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News