హరీశ్ శంకర్ దర్శకత్వంలో రామ్?
పవన్ తో చేయాల్సిన సినిమా డ్రాప్ అయిన తర్వాత హరీశ్ శంకర్ ఒక్కసారిగా ఫ్రీ అయిపోయాడు. అతడు తన నెక్ట్స్ మూవీని ఏ హీరోతో చేస్తాడనే అంశంపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. ఆ హీరోల జాబితాలో రామ్ పేరు కూడా వినిపించింది. వారియర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హరీశ్ శంకర్ కూడా హాజరవ్వడంతో.. రామ్-హరీష్ కాంబోపై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. రామ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు హరీశ్ శంకర్. […]
పవన్ తో చేయాల్సిన సినిమా డ్రాప్ అయిన తర్వాత హరీశ్ శంకర్ ఒక్కసారిగా ఫ్రీ అయిపోయాడు. అతడు తన నెక్ట్స్ మూవీని ఏ హీరోతో చేస్తాడనే అంశంపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది.
ఆ హీరోల జాబితాలో రామ్ పేరు కూడా వినిపించింది. వారియర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హరీశ్ శంకర్ కూడా హాజరవ్వడంతో.. రామ్-హరీష్ కాంబోపై ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి.
ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. రామ్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చాడు హరీశ్ శంకర్. రామ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే, ప్రస్తుతానికి ఆ హీరోతో సినిమా లేదని ప్రకటించాడు.
“నేను ‘దేవదాస్’ నుంచి రామ్ ఫ్యాన్. ఎన్నోసార్లు అతనితో సినిమా చేయాలని ట్రై చేశా. వేర్వేరు కారణాల వల్ల కుదరలేదు. బెస్ట్ పార్ట్ ఏంటంటే… కథ చెబుతున్నప్పుడు ప్రేక్షకుడిలా ఆలోచిస్తాడు. ఒకసారి నేను సెన్సిటివ్ లవ్ స్టోరీ చెప్పాను.
అందులో ఇద్దరు హీరోలు ఉంటారు. అది రామ్ చేసే సినిమా కాదు. నేను కూడా వేరే తరహా సినిమా చేద్దామనుకున్నా. అప్పుడు ఫ్యాన్ రెండులోనో, మూడులోనో తిరుగుతోంది. రామ్ ఒక డైలాగ్ చెప్పాడు… ‘బ్రో, మనం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలి’ అన్నాడు.
అది నాకు బాగా నచ్చింది. కచ్చితంగా రామ్ తో సినిమా ఉంటుంది. అది ఎప్పుడనేది ఈ రోజు చెప్పలేను. రామ్ తో నేను సినిమా చేస్తున్నా. అతి త్వరలో సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను.”
ఇలా రామ్ తో చేయాల్సిన సినిమాపై స్పందించాడు హరీశ్ శంకర్. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయడం దర్శకులకు పెద్ద టాస్క్ అన్న హరీశ్ శంకర్… మంచి క్యారెక్టర్ రాసినప్పుడు, పెర్ఫార్మన్స్ చేయడం అనేది యాక్టర్లకు ఛాలెంజ్ అన్నాడు.