ఎన్టీఆర్ సరసన సమంత?

సమంతపై పుకార్లు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంపై, ఫిలిం కెరీర్ పై పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత ఫిల్మోగ్రఫీపై మరో పుకారు చెలరేగింది. త్వరలోనే ఆమె ఎన్టీఆర్ సరసన నటించబోతోందనేది ఆ పుకారు. ఇంతకుముందు తారక్-సమంత కాంబినేషన్ లో బృందావనం, జనతా గ్యారేజీ, రామయ్యా వస్తావయ్యా సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆమె ఎన్టీఆర్ సరసన నటించబోతోందని సమాచారం. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో సమంతను […]

Advertisement
Update:2022-07-10 09:31 IST

సమంతపై పుకార్లు కొత్త కాదు. ఎప్పటికప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంపై, ఫిలిం కెరీర్ పై పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత ఫిల్మోగ్రఫీపై మరో పుకారు చెలరేగింది. త్వరలోనే ఆమె ఎన్టీఆర్ సరసన నటించబోతోందనేది ఆ పుకారు.

ఇంతకుముందు తారక్-సమంత కాంబినేషన్ లో బృందావనం, జనతా గ్యారేజీ, రామయ్యా వస్తావయ్యా సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆమె ఎన్టీఆర్ సరసన నటించబోతోందని సమాచారం. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అలా జనతా గ్యారేజీ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోందంటూ కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతానికైతే ఎన్టీఆర్-కొరటాల సినిమాకు హీరోయిన్ ను లాక్ చేయలేదు. మొన్ననే ఈ సినిమా నెరేషన్ పూర్తయింది. ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లెక్కప్రకారం ఈ సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి రావాలి. కానీ నెల రోజులు వాయిదా వేశారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో సమంత ఉందా లేదా అనే విషయం సెప్టెంబర్ లో తేలిపోతుంది.

ఈ సినిమా లేట్ అవ్వడానికి మొన్నటివరకు కొరటాల కారణం. కథపై పూర్తిస్థాయిలో కసరత్తు చేయడం కోసం టైమ్ తీసుకున్నాడు. ఇప్పుడు లేట్ అవ్వడానికి ఎన్టీఆర్ కారణం. ఈ సినిమా కోసం తారక్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇంకా పూర్తికాలేదు. అందుకే సినిమా కాస్త లేట్ అయింది.

Tags:    
Advertisement

Similar News