ఇకపై ప్రతి పండక్కి చిరంజీవి సినిమా

అన్-సీజన్ లో విడుదలైంది ఆచార్య సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కంటెంట్ తో పాటు, రాంగ్ టైమ్ రిలీజ్ కూడా ఓ కారణం. ఈ ఫీడ్ బ్యాక్ చిరంజీవికి కూడా అందింది. అందుకే ఇకపై తన సినిమాల్ని పండగలకు మాత్రమే విడుదల చేయాలని చిరంజీవి నిర్ణయించారు. ఈ విషయంలో మరో హీరోతో పోటీ వచ్చినప్పటికీ, వెనక్కి తగ్గకూడదని చిరు భావిస్తున్నారట. ముందుగా చిరంజీవి నుంచి పండక్కి వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మెహన్ రాజా దర్శకత్వంలో […]

Advertisement
Update:2022-07-10 11:45 IST

అన్-సీజన్ లో విడుదలైంది ఆచార్య సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కంటెంట్ తో పాటు, రాంగ్ టైమ్ రిలీజ్ కూడా ఓ కారణం. ఈ ఫీడ్ బ్యాక్ చిరంజీవికి కూడా అందింది. అందుకే ఇకపై తన సినిమాల్ని పండగలకు మాత్రమే విడుదల చేయాలని చిరంజీవి నిర్ణయించారు. ఈ విషయంలో మరో హీరోతో పోటీ వచ్చినప్పటికీ, వెనక్కి తగ్గకూడదని చిరు భావిస్తున్నారట.

ముందుగా చిరంజీవి నుంచి పండక్కి వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మెహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు దాదాపు రూట్ మ్యాప్ సిద్ధమైంది. నయనతార, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించాడు. సల్మాన్ పై ఓ ఫైట్ తో పాటు, సల్మాన్-చిరు కాంబోలో ఓ సాంగ్ కూడా తీశారు. దసరాకు ఇది పెర్ ఫెక్ట్ అని భావిస్తున్నారు.

దసరా తర్వాత చిరంజీవి టార్గెట్ చేసిన మరో ఫెస్టివల్ సంక్రాంతి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. చిరు నుంచి సంక్రాంతికి ఓ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ లోటును భోళాశంకర్ తీర్చబోతోంది. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

దసరా, సంక్రాంతి తర్వాత వస్తున్న మరో పెద్ద పండగ ఉగాది. ఈ పండక్కి కూడా చిరంజీవి సినిమా సిద్ధం అవుతోంది. బాబి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను ఉగాదికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    
Advertisement

Similar News