విక్రమ్ కు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదు

ఊపిరితిత్తుల్లో అసౌకర్యంగా అనిపించడంతో ఉన్నఫలంగా చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు హీరో విక్రమ్. అంత మాత్రానికే మీడియా, అతడికి గుండెపోటు వచ్చిందంటూ కథనాలు అల్లేసింది. దీనిపై విక్రమ్ మేనేజర్ పూర్తి స్పష్టత ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగలేదు. ఆ తర్వాత స్వయంగా హాస్పిటల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. విక్రమ్ కు వచ్చింది గుండెపోటు కాదని, ఛాతినొప్పి అని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని విక్రమ్ తనయుడు, ధృవ కూడా స్పష్టంచేశాడు. పుకార్లకు పూర్తిస్థాయిలో తెరదించాడు. […]

Advertisement
Update:2022-07-09 05:16 IST

ఊపిరితిత్తుల్లో అసౌకర్యంగా అనిపించడంతో ఉన్నఫలంగా చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు హీరో విక్రమ్. అంత మాత్రానికే మీడియా, అతడికి గుండెపోటు వచ్చిందంటూ కథనాలు అల్లేసింది. దీనిపై విక్రమ్ మేనేజర్ పూర్తి స్పష్టత ఇచ్చినప్పటికీ పుకార్లు ఆగలేదు. ఆ తర్వాత స్వయంగా హాస్పిటల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. విక్రమ్ కు వచ్చింది గుండెపోటు కాదని, ఛాతినొప్పి అని స్పష్టం చేసింది.

ఇదే విషయాన్ని విక్రమ్ తనయుడు, ధృవ కూడా స్పష్టంచేశాడు. పుకార్లకు పూర్తిస్థాయిలో తెరదించాడు. తన తండ్రికి హార్ట్ ఎటాక్ రాలేదని తెలిపిన ధృవ్.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు హాస్పిటల్ నుంచి విక్రమ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

“ఫ్యాన్స్ మరియు సన్నిహితులకు విజ్ఞప్తి. నాన్నకు ఛాతిలో అసౌకర్యంగా అనిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ట్రీట్ మెంట్ కూడా అదే కోణంలో జరిగింది. అందరూ చెబుతున్నట్టు నాన్నకు హార్ట్ ఎటాక్ రాలేదు. ఇలాంటి రూమర్లు విని చాలా బాధపడ్డాం. మీ అందర్నీ కోరేది ఒకటే. దయచేసి పుకార్లు పుట్టించకండి. ఈ సమయంలో మాకు ప్రైవసీ కావాలి. ప్రస్తుతం చియాన్ ఆరోగ్యంగానే ఉన్నారు. మరో రోజులో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు.”

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్-1 టీజర్ నిన్న రిలీజైంది. ఆ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి హాజరవ్వడానికి విక్రమ్ రెడీ అవుతున్నా టైమ్ లో ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అలా విక్రమ్ లేకుండానే కార్యక్రమం జరిగింది.

Tags:    
Advertisement

Similar News