మహేష్ బాబు చేతుల మీదుగా.. ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్ రిలీజ్

చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. రాజరాజ చోళ పాలనా కాలంలో సాగే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పిరియాడిక్ డ్రామాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి చెందిన టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. చియాన్ విక్రమ్ ఇవాళ ఉదయం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం […]

Advertisement
Update:2022-07-08 13:57 IST

చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్‘. రాజరాజ చోళ పాలనా కాలంలో సాగే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పిరియాడిక్ డ్రామాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగానికి చెందిన టీజర్‌ను ఇవాళ రిలీజ్ చేశారు.

చియాన్ విక్రమ్ ఇవాళ ఉదయం గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయినా సరే చిత్ర బృందం ముందుగా ప్రకటించిన సమయానికే టీజర్‌ను విడుదల చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.

తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. కొద్ది సేపటి క్రితమే విడుదలైన ఈ టీజర్ అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేసి చూపిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. భారీ సెట్టింగ్స్, సముద్రంలో ఓడలపై యుద్ధానికి సైనికుల తరలింపు, హీరోయిన్ల అందచందాలు టీజర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గుర్రాలపై పోరాటాలు అభిమానులను అలరించడం ఖాయమే. చాలా సున్నితమైన ప్రేమకథలు తెరకెక్కించే మణిరత్నం.. ఈసారి ఒక నవలను పిరియాడికల్ డ్రామాగా తీస్తుండటంలో అందరిలో ఆసక్తి కలిగిస్తుంది.

ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం హైలైట్‌గా మారనుంది. సిమాకు ఫొటోగ్రఫీ రవి వర్మన్, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ తోటా తరణి, కొరియోగ్రఫీ బృంద, యాక్షన్ కెచా ఖంపాక్డీ, షామ్ కుషాల్, దిలిప్ సుబ్బరాయన్ అందిస్తున్నారు. తెలుగులో పాటలు అనంత శ్రీరామ్, డైలాగులు తణికెళ్ల భరణి రాస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News