షాకింగ్ నిర్ణయం తీసుకున్న నటి మీనా?
సీనియర్ నటి మీనా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారా? ఆమె ఇక సినిమాల్లో నటించరా? పూర్తిగా కుటుంబానికే పరిమితం అవ్వబోతున్నారా? ప్రస్తుతం ఆమెపై ఇలాంటి పుకార్లే వినిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ఆమె తన భర్తను కోల్పోవడమే. మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మీనాకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉండేవారు విద్యాసాగర్. ఆమె షూటింగ్స్ కు వెళ్తే కూతురు నైనిక బాధ్యతల్ని తను తీసుకునేవారు. మరీ ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా వరుస సినిమాలతో […]
సీనియర్ నటి మీనా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారా? ఆమె ఇక సినిమాల్లో నటించరా? పూర్తిగా కుటుంబానికే పరిమితం అవ్వబోతున్నారా? ప్రస్తుతం ఆమెపై ఇలాంటి పుకార్లే వినిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ఆమె తన భర్తను కోల్పోవడమే.
మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. మీనాకు అన్ని రకాలుగా చేదోడువాదోడుగా ఉండేవారు విద్యాసాగర్. ఆమె షూటింగ్స్ కు వెళ్తే కూతురు నైనిక బాధ్యతల్ని తను తీసుకునేవారు. మరీ ముఖ్యంగా సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా వరుస సినిమాలతో బిజీ అయిన టైమ్ లో కూతురు కోసం, విద్యాసాగర్ తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు.
అలా కుటుంబంలో అన్నీతానై చూసుకున్న ఆయన హఠాన్మరణంతో మీనా జీవితంతో పాటు, కెరీర్ కూడా డైలమాలో పడింది. ఒక్కగానొక్క కూతుర్ని చూసుకోవడం కోసం ఆమె తన సినీ కెరీర్ ను ఫణంగా పెట్టాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం అంగీకరించిన సినిమాల్ని పూర్తిచేసి, ఇక కెరీర్ కు స్వస్తి పలకాలని ఆమె భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతానికైతే వీటిపై మీనా నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో మీనా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. దృశ్యం లాంటి సూపర్ హిట్స్ అందుకోవడంతో పాటు.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇలాంటి టైమ్ లో కెరీర్ ను వదులుకోవడం అంటే ఎవరికైనా కష్టమే. కానీ మీనాకు కుటుంబ పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవని తెలుస్తోంది.