ప్రేమ.. భోజనం.. ప్రభాస్
ప్రభాస్ గురించి చెప్పమంటే హీరోయిన్లు ముందుగా చెప్పే ఆన్సర్, అతడు వడ్డించే భోజనం గురించే. ఆంధ్రాలో దొరికే అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని తన హీరోయిన్ల కోసం వండిస్తాడు ప్రభాస్. తన దగ్గరుండి వడ్డిస్తాడు కూడా. ఈ ప్రేమానుభవం హీరోయిన్ శృతిహాసన్ కు కూడా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, తన హీరోను పొగడ్తలతో ముంచెత్తుతోంది. ప్రభాస్ సెట్స్ లో ఉంటే భోజనం గురించి ఆలోచించుకోనక్కర్లేదు అంటోంది శృతిహాసన్. ఆంధ్రా, […]
ప్రభాస్ గురించి చెప్పమంటే హీరోయిన్లు ముందుగా చెప్పే ఆన్సర్, అతడు వడ్డించే భోజనం గురించే. ఆంధ్రాలో దొరికే అన్ని రకాల నాన్-వెజ్ వంటకాల్ని తన హీరోయిన్ల కోసం వండిస్తాడు ప్రభాస్. తన దగ్గరుండి వడ్డిస్తాడు కూడా. ఈ ప్రేమానుభవం హీరోయిన్ శృతిహాసన్ కు కూడా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ, తన హీరోను పొగడ్తలతో ముంచెత్తుతోంది.
ప్రభాస్ సెట్స్ లో ఉంటే భోజనం గురించి ఆలోచించుకోనక్కర్లేదు అంటోంది శృతిహాసన్. ఆంధ్రా, తెలంగాణ రుచుల్ని తన కోసం ప్రత్యేకంగా తయారుచేయించి తీసుకొస్తాడని చెప్పుకొచ్చింది. అలా వండించిన ఆహార పదార్థాల్ని స్వయంగా తనే వడ్డిస్తాడని తెలిపిన శృతిహాసన్, ప్రతి వంటకం పేరును, దాని ప్రత్యేకతను ప్రభాస్ వివరిస్తాడని అంటోంది.
అందుకే ప్రభాస్ అంటే ప్రేమ, భోజనం ఈ రెండూ గుర్తొస్తాయని చెబుతోంది శృతి. హీరోయిజం అనే పదానికి ప్రభాస్ కు అర్థం తెలియదంటోంది శృతి. ఎలాంటి స్టార్ డమ్ లేకుండా, ఫ్రెండ్లీగా కలిసిపోయే స్వీట్ పర్సన్ అంటోంది. ప్రభాస్ లాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా దొరుకుతారని, తనకు అలాంటి అరుదైన వ్యక్తి దొరకడం తన అదృష్టం అంటోంది.
ప్రభాస్ మాటల్లో, చేతల్లో, చూపులో స్వచ్ఛత కనిపిస్తుందని.. అది తనకు చాలా ఇష్టమని అంటోంది. బహుశా.. ప్రభాస్ ను ఈ స్థాయిలో, ఇంత అందంగా పొగిడిన హీరోయిన్ మరొకరు లేరేమో.