పక్కా కమర్షియల్.. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ అంట

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు, మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ వచ్చేసింది. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా నిన్నటితో మొదటి వారాంతం రన్ పూర్తిచేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ 3 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందట. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనతో పాటు, పోస్టర్ కూడా […]

Advertisement
Update:2022-07-04 08:22 IST

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు, మొదటి ఆటకే అట్టర్ ఫ్లాప్ వచ్చేసింది. అయినప్పటికీ మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. ఇప్పుడీ సినిమా నిన్నటితో మొదటి వారాంతం రన్ పూర్తిచేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ 3 రోజులకే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందట.

ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనతో పాటు, పోస్టర్ కూడా వచ్చేసింది. పక్కా కమర్షియల్ సినిమాకు 3 రోజుల్లో వరల్డ్ వైడ్ 15 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వచ్చిందంట. ఈ వసుళ్లతో సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు గీతాఆర్ట్స్-2 సంస్థ ప్రకటించుకుంది. అంతేకాదు, ఈ సినిమాతో మరోసారి మారుతి తన సత్తా చాటాడని, నిర్మాతలు-బయ్యర్ల ఫేవరెట్ దర్శకుడు అనిపించుకున్నాడంటూ ప్రకటించుకుంది.

ఈ సందర్భంగా కొన్ని లెక్కల్ని కూడా మేకర్స్ బయటపెట్టారు. ప్రచారంతో కలుపుకొని పక్కా కమర్షియల్ సినిమాకు 35 కోట్ల రూపాయల ఖర్చు అయిందట. వీటిలో 32 కోట్ల రూపాయలు డిజిటల్, శాటిలైట్, ఆడియో, హిందీ డబ్బింగ్ రూపంలో వచ్చేశాయట. కాబట్టి అక్కడే నిర్మాతలు సేఫ్ అయిపోయారనేది మేకర్స్ వాదన.

ఇక థియేట్రికల్ రిలీజ్ విషయానికొస్తే.. ఏపీ,నైజాంలోని చాలా ప్రాంతాల్లో యూవీ, జీఏ-2 సంస్థలు ఈ సినిమాను సొంతంగా విడుదల చేసుకున్నాడట. దీంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెబుతున్నారు. మరోవైపు ఆన్ లైన్ లో చూస్తే, ఆక్యుపెన్సీ అస్సలు కనిపించలేదు. ఆదివారం సాయంత్రం షోలు కూడా సరిగ్గా నిండలేదు. ఓవైపు ఆక్యుపెన్సీ, సినిమా టాక్ ఇలా ఉంటుండగా, ఇంకోవైపు మేకర్స్ మాత్రం బ్రేక్ ఈవెన్ అని ప్రకటించుకున్నారు.

Tags:    
Advertisement

Similar News