పొన్నియన్ సెల్వన్ రిలీజ్ డేట్ ఫిక్స్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (పీఎస్). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, […]
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (పీఎస్). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది.
1950ల్లో విడుదలై సెన్సేషనల్ హిట్టయిన కల్కి అనే తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. పదో శతాబ్దానికి చెందిన సాహసోపేత అంశాలతో అల్లుకున్న నవల పొన్నియిన్ సెల్వన్. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు. తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్ సెల్వర్ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. శత్రువుల కోసం పనిచేసిన కోవర్టులు (అస్మదీయులు) గురించి కూడా ప్రస్తావిస్తుంది.
ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.