కెప్టెన్ మిల్లర్.. ఇది హాలీవుడ్ సినిమా కాదు

కెప్టెన్ అమెరికా టైపులో కెప్టెన్ మిల్లర్ అనే సినిమా వస్తోంది. కాకపోతే అది హాలీవుడ్ సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనుంది. సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే టైటిల్ […]

Advertisement
Update:2022-07-03 04:26 IST

కెప్టెన్ అమెరికా టైపులో కెప్టెన్ మిల్లర్ అనే సినిమా వస్తోంది. కాకపోతే అది హాలీవుడ్ సినిమా, ఇది పాన్ ఇండియా సినిమా. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌ కలయికలో ఓ భారీ పీరియాడికల్ చిత్రం రూపొందనుంది. 1930-40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనుంది.

సత్యజ్యోతి ఫిలింస్‌ పతాకంపై అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అనే టైటిల్ పెట్టారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో చాలా ఆసక్తికరంగా వుంది. ఒక స్కెచ్ డ్రాయింగ్ లో 1930-40నాటి షిప్ ని చూపిస్తూ హీరో ముఖం కనిపించకుండా స్కార్ఫ్ చుట్టుకొని ఒక వింటేజ్ బైక్ నడుపుకుంటూరావడం, తర్వాత టైటిల్ రివిల్ కావడం ఎక్సయిటింగ్ గా వుంది. వీడియోలో వినిపించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఇదొక భారీ పీరియాడికల్ మూవీ అనే విషయం వీడియో చూస్తే అర్ధమౌతుంది.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ సినిమా తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతంసమకూరుస్తుండగా, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేయబోతున్నాడు. కెప్టెన్ మిల్లర్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Full View

Tags:    
Advertisement

Similar News