పక్కా కమర్షియల్ మొదటి రోజు వసూళ్లు

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. థియేటర్లలో ఆడియన్స్ బుర్ర తినేసింది. ఆ విషయం విడుదలకు ముందు జనాలకు తెలియదు కదా. అందుకే మొదటి రోజు ఈ సినిమాకు కాస్త భారీగానే జనం వచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయినా, కౌంటర్ సేల్ బాగా నడిచింది. సి, బి సెంటర్లలో ప్రేక్షకులు టికెట్లు కొన్నారు. అలా మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 30 లక్షల […]

Advertisement
Update:2022-07-02 10:26 IST

గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. థియేటర్లలో ఆడియన్స్ బుర్ర తినేసింది. ఆ విషయం విడుదలకు ముందు జనాలకు తెలియదు కదా. అందుకే మొదటి రోజు ఈ సినిమాకు కాస్త భారీగానే జనం వచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోయినా, కౌంటర్ సేల్ బాగా నడిచింది. సి, బి సెంటర్లలో ప్రేక్షకులు టికెట్లు కొన్నారు.

అలా మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. శని, ఆదివారాల కలెక్షన్లు కూడా కలుపుకుంటే.. వారాంతం ముగిసేసరికి ఈ సినిమా 10 కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

అయితే గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా మాత్రం ఈ సినిమా నిలవలేకపోయింది. గతంలో అతడు నటించిన సీటీమార్ సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ రికార్డును పక్కా కమర్షియల్ క్రాస్ చేయలేకపోయింది.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. వరల్డ్ వైడ్ ఈ సినిమా 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 20 కోట్లు రావాలి. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను ఏకంగా 17 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. ఈ టాక్ తో, ఈ ఆక్యుపెన్సీతో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది చూడాలి.

Tags:    
Advertisement

Similar News