96 గంటల పాటు నాన్ స్టాప్ ప్రీమియర్స్.. ఏ సినిమాకో తెలుసా?

ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయడం సహజం. ముందురోజు సాయంత్రం నుంచి మొదలై, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు, 7 గంటలకు కూడా షోలు పడుతుంటాయి. ఇన్నాళ్లూ ఇక్కడివరకు మాత్రమే చూశాం. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు ఓ సినిమా ప్రీమియర్స్ కు రెడీ అవుతోంది. ఆ సినిమా పేరు ధోర్: లవ్ అండ్ థండర్. అమెరికా కంటే ఒక రోజు ముందు భారతదేశంలో విడుదల చేయడమే కాకుండా, మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ […]

Advertisement
Update:2022-07-02 12:56 IST

ఓ పెద్ద సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయడం సహజం. ముందురోజు సాయంత్రం నుంచి మొదలై, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు, 7 గంటలకు కూడా షోలు పడుతుంటాయి. ఇన్నాళ్లూ ఇక్కడివరకు మాత్రమే చూశాం. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు ఓ సినిమా ప్రీమియర్స్ కు రెడీ అవుతోంది.

ఆ సినిమా పేరు ధోర్: లవ్ అండ్ థండర్. అమెరికా కంటే ఒక రోజు ముందు భారతదేశంలో విడుదల చేయడమే కాకుండా, మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ ినిమాను జూలై 7 నుండి 4 రోజుల పాటు వరుసగా 96 గంటల పాటు ప్రీమియర్స్ నిర్వహించనున్నారు. ఇండియాలో ఇదో రికార్డ్.

అయితే దేశవ్యాప్తంగా ఇలా ప్రీమియర్స్ వేయడం లేదు. దేశంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో, మల్టీప్లెక్సుల్లో మాత్రం ఇలా మారధాన్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. జులై 7 అర్థరాత్రి నుంచి మొదలుపెట్టి, 10వ తేదీ అర్థరాత్రి వరకు 96 గంటల పాటు ఇండియాలో ఈ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ప్రయోగం, ప్రయత్నం జరగలేదు. తొలిసారి ఓ హాలీవుడ్ సినిమాకు ఇండియాలో ఇలా వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఇది క్లిక్ అయితే, రాబోయే రోజుల్లో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News