చిరంజీవికి పోటీగా రెడీ అయిన కల్యాణ్ రామ్

చిరంజీవి సినిమా నుంచి అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. 4వ తేదీన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రాబోతోంది. అయితే ఇప్పుడు దానికి కూడా పోటీ వచ్చేసింది. సరిగ్గా అదే రోజు కల్యాణ్ రామ్ కూడా రెడీ అయ్యాడు. తన కొత్త సినిమా బింబిసార ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నాడు. కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఇందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి క్రూరుడైన […]

Advertisement
Update:2022-07-02 10:25 IST

చిరంజీవి సినిమా నుంచి అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. 4వ తేదీన గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రాబోతోంది. అయితే ఇప్పుడు దానికి కూడా పోటీ వచ్చేసింది. సరిగ్గా అదే రోజు కల్యాణ్ రామ్ కూడా రెడీ అయ్యాడు. తన కొత్త సినిమా బింబిసార ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నాడు.

కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఇందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నాడు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా.. మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నాడు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజైంది.

ఇప్పుడీ సినిమాకు ట్రయిలర్ రెడీ అయింది. 4వ తేదీన బింబిసార ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. కల్యాణ్ రామ్ రెండు షేడ్స్ కు సంబంధించి మరిన్ని షేడ్స్ ను ట్రయిలర్ లో చూడొచ్చు.

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు కల్యాణ్ రామ్. ఇప్పడీ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ట్రయిలర్ తో ఈ అంచనాలు రెట్టింపు కాబోతున్నాయి.

సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఇందులో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కల్యామ్ రామ్ సరసన క్యాథరీన్ త్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News