తప్పు తెలుసుకున్న హరీశ్ శంకర్
పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోమని దర్శకుడు హరీశ్ శంకర్ కు అతడి స్నేహితులు, సన్నిహితులు చాలామంది చెప్పి చూశారు. సమాంతరంగా మరో కథ రెడీ చేసుకోవాలి, మిగతా హీరోలతో టచ్ లో ఉండాలని సూచించారు. కానీ హరీశ్ వాళ్ల మాటలు వినలేదు. “భవదీయుడు భగత్ సింగ్” ప్రాజెక్ట్‌పై పట్టుదలతో ఉన్న హరీష్ శంకర్ దాదాపు రెండున్నరేళ్ల సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చదనే విషయాన్ని ఇప్పుడు గ్రహించాడు. 2 నెలల క్రితం వరకు […]
పవన్ కల్యాణ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోమని దర్శకుడు హరీశ్ శంకర్ కు అతడి స్నేహితులు, సన్నిహితులు చాలామంది చెప్పి చూశారు. సమాంతరంగా మరో కథ రెడీ చేసుకోవాలి, మిగతా హీరోలతో టచ్ లో ఉండాలని సూచించారు. కానీ హరీశ్ వాళ్ల మాటలు వినలేదు.
“భవదీయుడు భగత్ సింగ్” ప్రాజెక్ట్‌పై పట్టుదలతో ఉన్న హరీష్ శంకర్ దాదాపు రెండున్నరేళ్ల సమయాన్ని వృధా చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చదనే విషయాన్ని ఇప్పుడు గ్రహించాడు. 2 నెలల క్రితం వరకు పవన్ కళ్యాణ్ తన సినిమా పనులు ప్రారంభిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు హరీష్. అయితే పవన్ ఇప్పట్లో “భవదీయుడు భగత్ సింగ్” సినిమాని స్టార్ చేయడని స్పష్టం అయింది.
మరికొన్ని రోజుల్లో కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు పవన్. వినోదాయ శితం రీమేక్ గా రాబోతున్న ఈ సినిమాలో సాయితేజ్ కూడా నటిస్తున్నాడు. అక్టోబర్ నాటికి ఈ సినిమా పూర్తవుతుంది. ఇక అక్టోబర్ నుంచి ఆంధ్రప్రదేశ్ అంతటా రాజకీయ యాత్ర చేయనున్నాడు పవన్ కళ్యాణ్.
ఈ గ్యాప్ లో క్రిష్ దర్శకత్వంలో “హరి హర వీర మల్లు” చిత్రాన్ని పూర్తి చేయగలడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ సినిమా చేసే అవకాశం లేదు. ఈ సినిమా కోసం సమయం వృధా చేసిన హరీశ్, ఎట్టకేలకు తన తప్పు తెలుసుకున్నాడు. కానీ అతనికి ఇప్పుడు వేరే నటుల డేట్లు వెంటనే దొరకడం లేదు.