ఇకపై 50 రోజుల లాక్-ఇన్ పీరియడ్
మొన్నటివరకు చిన్న సినిమాలు మాత్రమే కాస్త తొందరగా ఓటీటీలోకి వచ్చేవి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఫ్లాప్ అయిన పెద్ద సినిమాలు కూడా తొందరగా ఓటీటీలోకి వచ్చేయడం స్టార్ట్ చేశాయి. అలా ముందుగానే స్ట్రీమింగ్ కు ఇవ్వడం వల్ల ఓటీటీ సంస్థల నుంచి అదనంగా కొంత డబ్బు నిర్మాతకు వస్తుంది. అందుకే ఇలా జరుగుతోంది. రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆచార్య లాంటి సినిమాలు ఇలానే అనుకున్న గడువు కంటే ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో ఏ సినిమానైనా […]
మొన్నటివరకు చిన్న సినిమాలు మాత్రమే కాస్త తొందరగా ఓటీటీలోకి వచ్చేవి. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఫ్లాప్ అయిన పెద్ద సినిమాలు కూడా తొందరగా ఓటీటీలోకి వచ్చేయడం స్టార్ట్ చేశాయి. అలా ముందుగానే స్ట్రీమింగ్ కు ఇవ్వడం వల్ల ఓటీటీ సంస్థల నుంచి అదనంగా కొంత డబ్బు నిర్మాతకు వస్తుంది. అందుకే ఇలా జరుగుతోంది.
రాధేశ్యామ్, భీమ్లానాయక్, ఆచార్య లాంటి సినిమాలు ఇలానే అనుకున్న గడువు కంటే ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. దీంతో ఏ సినిమానైనా అనుకున్న గడువు కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తుందనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వచ్చేసింది. దీంతో విరాటపర్వం, అంటే సుందరానికి లాంటి సినిమాల కోసం మెజారిటీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు. ఓటీటీలో వచ్చాక చూద్దామని ఆగిపోయారు.
ఇకపై ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్మాతలు నిర్ణయించారు. థియేట్రికల్ వ్యవస్థను కాపాడుకోవాలన్నా, సినిమాలు బతకాలన్నీ ఓటీటీకి, థియేట్రికల్ రిలీజ్ కు లాంగ్ గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 50 రోజుల లాక్-ఇన్ పీరియడ్ ను పెట్టామని నిర్మాతల తరఫున మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ ప్రకటించారు.
తమ బ్యానర్ నుంచి వచ్చే ఏ సినిమానైనా విడుదలైన 50 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీలోకి వస్తుందని ఆయన స్పష్టంచేశారు. నిర్మాతలు తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది కానీ, దీన్ని ఎంతమంది నిర్మాతలు ఫాలో అవుతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇప్పటికే ఇలాంటి నిబంధన ఒకటి ఉంది. చిరంజీవి, ప్రభాస్ తో సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్లే, ఈ నిబంధనను తుంగలో తొక్కారు. ఇప్పుడీ ’50 రోజుల’ కొత్త నిబంధనను ఎంతమంది పట్టించుకుంటారో చూడాలి