నన్ను అపార్ధం చేసుకోవద్దు.. నేను అహంకారిని కాను

మనకు బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా.. మనం ఎదురైనప్పుడు పలకరించకపోతే… వారు కావాలనే అలా చేస్తున్నారని, అహంకారంతో పొగరుతో ప్రవర్తిస్తున్నారని అనుకుంటాం కదా. తనను గురించి కూడా చాలామంది అలాగే అనుకుంటున్నారని, కానీ తనకున్నది అహంకారం కాదని, అనారోగ్యమని షెహనాజ్ ట్రెజరీ పేర్కొంది. ఆమె నటి, ట్రావెల్ బ్లాగర్. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తనకున్న విభిన్నమైన సమస్య గురించి చెప్పుకొచ్చారామె. తన సమస్యని ప్రోసోపాగ్నోసియా అంటారని…దీనిని ఫేస్ బ్లైండ్ నెస్ గా కూడా పిలుస్తారని షెహనాజ్ […]

Advertisement
Update:2022-06-29 12:39 IST

మనకు బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా.. మనం ఎదురైనప్పుడు పలకరించకపోతే… వారు కావాలనే అలా చేస్తున్నారని, అహంకారంతో పొగరుతో ప్రవర్తిస్తున్నారని అనుకుంటాం కదా. తనను గురించి కూడా చాలామంది అలాగే అనుకుంటున్నారని, కానీ తనకున్నది అహంకారం కాదని, అనారోగ్యమని షెహనాజ్ ట్రెజరీ పేర్కొంది. ఆమె నటి, ట్రావెల్ బ్లాగర్.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తనకున్న విభిన్నమైన సమస్య గురించి చెప్పుకొచ్చారామె. తన సమస్యని ప్రోసోపాగ్నోసియా అంటారని…దీనిని ఫేస్ బ్లైండ్ నెస్ గా కూడా పిలుస్తారని షెహనాజ్ తెలిపింది. గత కొంతకాలంగా బాగా తెలిసినవారి మొహాలు, గొంతులను సైతం గుర్తుపట్టలేని సమస్యతో బాధపడుతున్నానని … అందుకు కారణమేమిటో ఇప్పుడు తెలిసిందని, ఇది మెదడుకి సంబంధించిన సమస్య అని, ఈ విషయం అర్థం చేసుకుని, తనని అపార్థం చేసుకోవద్దని షెహనాజ్ కోరింది.

‘ఇరుగుపొరుగువారు, స్నేహితులు, సహోద్యోగులు, క్లయింట్లు… ఇలా మనకు బాగా తెలిసినవారంతా మనం వారిని చూసినా పలకరించకపోతే… అపార్థమే చేసుకుంటారు. మనకు దూరమైపోతారు. ప్రస్తుతం చాలామంది నన్ను అలాగే అనుకుంటున్నారని షెహనాజ్ తెలిపింది.

బాగా తెలిసినవారినైనా కొంత విరామంతో చూసినప్పుడు వారి మొహాలను గుర్తించలేకపోతున్నానని… దయచేసి తన సమస్యని అర్థం చేసుకోమని ఆమె అభ్యర్థించింది. ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్నవారిలో చాలామంది… వ్యక్తుల హెయిర్ స్టయిల్ ని గుర్తుంచుకుని, తరువాత వారు కలిసినప్పుడు అదే గుర్తుచేసుకుని వారిని గుర్తించే ప్రయత్నం చేస్తారని… అయితే ఆ వ్యక్తుల్లో ఎవరైనా తమ హెయిర్ స్టయిల్ ని మార్చుకుంటే… తరువాత వారిని చూసినప్పుడు వీరు గుర్తుపట్టలేరని షెహనాజ్ తన పోస్టులో పేర్కొంది.

41 సంవత్సరాల షెహనాజ్ 2001లో ఎదురులేని మనిషి అనే తెలుగు సినిమాలో నటించింది. అంతకుముందు ఆమె మోడల్ గానూ, ఎమ్ టివిలో విజెగానూ పనిచేసింది. ఇష్క్ విష్క్, ఢిల్లీ బెల్లీ చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.

Advertisement

Similar News