పుకార్లు కొట్టి పారేసిన సింగింగ్ కపుల్
సింగర్స్ హేమచంద్ర, శ్రావణభార్గవి నిజజీవితంలో భార్యభర్తలనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడీ జంటపై చాలా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ కథనాలు వచ్చాయి. శ్రావణ భార్గవి, భర్తకు దూరంగా సెపరేట్ గా ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇక కూతురు ఎవరి సంరక్షణలో ఉంటుందా అంటూ విశ్లేషణలు కూడా పుట్టుకొచ్చాయి. అసలు వీళ్లు విడిపోవాడానికి కారణాలివే అంటూ మరికొన్ని చర్చలు కూడా తెరపైకొచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై గాయకుడు హేమచంద్ర స్పందించాడు. […]
సింగర్స్ హేమచంద్ర, శ్రావణభార్గవి నిజజీవితంలో భార్యభర్తలనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడీ జంటపై చాలా గాసిప్స్ పుట్టుకొచ్చాయి. వీళ్లిద్దరూ విడిపోతున్నారంటూ కథనాలు వచ్చాయి.
శ్రావణ భార్గవి, భర్తకు దూరంగా సెపరేట్ గా ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇక కూతురు ఎవరి సంరక్షణలో ఉంటుందా అంటూ విశ్లేషణలు కూడా పుట్టుకొచ్చాయి. అసలు వీళ్లు విడిపోవాడానికి కారణాలివే అంటూ మరికొన్ని చర్చలు కూడా తెరపైకొచ్చాయి.
ఈ మొత్తం వ్యవహారంపై గాయకుడు హేమచంద్ర స్పందించాడు. శ్రావణ భార్గవి తను కలిసే ఉన్నామని, చాలా సంతోషంగా ఉన్నామని ప్రకటించాడు. వ్యక్తిగత విషయాల్లోకి చొరబడి ఇలా లేనిపోని వార్తలు రాసే వాళ్లకు హేమచంద్ర తనదైన శైలిలో చురకలు కూడా అంటించాడు.
తను పాడిన పాటల కంటే, తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన పుకార్లు బాగా వైరల్ అయ్యాయని వ్యంగ్యంగా స్పందించాడు హేమచంద్ర. తను పాడిన పాటల కంటే పనికిమాలిన సమాచారమే ఎక్కువగా వ్యాపిస్తోందని అన్నాడు. ఇకనైనా ఎవరిపని వాళ్లు చేసుకుంటే మంచిదన్నాడు.
అటు శ్రావణ భార్గవి కూడా ఈ పుకార్లపై స్పందించింది. “గత కొన్ని రోజులుగా, నా యూట్యూబ్ వీక్షణలు పెరిగాయి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు పెరిగారు, నేను సాధారణంగా చేసే దాని కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఈ గాసిప్స్ నాకు బాగా కలిసొచ్చాయి. సోషల్ మీడియా ఓ బ్లెస్సింగ్.” అంటూ పోస్ట్ పెట్టింది.
మొత్తమ్మీద ఈ భార్యభర్తల ప్రకటనలతో ఇన్నాళ్లూ వీళ్లపై వచ్చిన పుకార్లకు చెక్ పడింది. ఆర్ఆర్ఆర్ లో హేమచంద్ర పాడిన దోస్తీ సాంగ్ పెద్ద హిట్టయిన సంగతి తెలిసిందే. అటు శ్రావణ భార్గవి కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది