జబర్దస్త్ నుంచి మరో వికెట్ డౌన్
దాదాపు మూడేళ్లుగా జబర్దస్త్ నుంచి వరుసపెట్టి వికెట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వికెట్ పడింది. ఈసారి కూడా కీలకమైన వ్యక్తే తప్పుకున్నారు. అది మరెవరో కాదు, యాంకర్ అనసూయ. అవును.. ఇన్నాళ్లూ జబర్దస్త్ కు గ్లామరస్ అంబాసిడర్ గా ఉన్న అనసూయ, ఆ షో నుంచి తప్పుకున్నారు. అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ. ఆ రేంజ్ లో ఉండేది అనుబంధం. కేవలం అనసూయ అందాలు చూసేందుకు జబర్దస్త్ షో ఫాలో అయ్యేవాళ్లు కూడా […]
దాదాపు మూడేళ్లుగా జబర్దస్త్ నుంచి వరుసపెట్టి వికెట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వికెట్ పడింది. ఈసారి కూడా కీలకమైన వ్యక్తే తప్పుకున్నారు. అది మరెవరో కాదు, యాంకర్ అనసూయ. అవును.. ఇన్నాళ్లూ జబర్దస్త్ కు గ్లామరస్ అంబాసిడర్ గా ఉన్న అనసూయ, ఆ షో నుంచి తప్పుకున్నారు.
అనసూయ అంటే జబర్దస్త్.. జబర్దస్త్ అంటే అనసూయ. ఆ రేంజ్ లో ఉండేది అనుబంధం. కేవలం అనసూయ అందాలు చూసేందుకు జబర్దస్త్ షో ఫాలో అయ్యేవాళ్లు కూడా ఉన్నారు. ఆమె వేసుకునే దుస్తులు, వేసే డాన్స్ చూడ్డానికి చాలా మంది ఇష్టపడేవారు. మధ్యమధ్యలో వచ్చే అనసూయ ఎక్స్ ప్రెషన్స్, ఆ కొంటె నవ్వులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
జబర్దస్త్ వల్ల అనసూయకు ఎంత పేరొచ్చిందో, అనసూయ వల్ల జబర్దస్త్ కూడా అంతే క్లిక్ అయింది. ఇప్పుడీ బంధం వీగిపోయింది. జబర్దస్త్ నుంచి అనసూయ వెళ్లిపోయింది. ఈ సూపర్ హిట్ షో నుంచి కీలకమైన సభ్యులు తప్పుకోవడం ఇదే తొలిసారి కాదు.
రైటర్లు భరత్-నితిన్ తప్పుకున్నప్పట్నుంచే జబర్దస్త్ కు క్రేజ్ తగ్గింది. ఆ తర్వాత నాగబాబు తప్పుకోవడం మరో పెద్ద దెబ్బ. ఆ తర్వాత రోజా, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఇలా కీలకమైన సభ్యులు ఒక్కొక్కరే తప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా అనసూయ తప్పుకోవడంతో షో కళ తప్పింది.
ఇప్పటికే జబర్దస్త్ కు టీఆర్పీలు తగ్గిపోయాయి. అనసూయ లేకపోవడంతో రేటింగ్స్ మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో ఈ కార్యక్రమంపై ఈటీవీ, మల్లెమాల సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.