డైరక్టర్ అవ్వాలంటే ఆ టాలెంట్ ఉండాలంట
ఎవరైనా దర్శకుడు అవ్వాలంటే, అలాంటి వ్యక్తికి కచ్చితంగా ఓ క్వాలిటీ ఉండాలంటున్నాడు మారుతి. దర్శకుడిగా ఎదగాలనుకునే వ్యక్తికి మీడియేషన్ తెలిసి ఉండాలంటున్నాడు. ఇటు ప్రేక్షకుడికి, అటు నిర్మాతకు మధ్య సరిగ్గా మీడియేషన్ చేస్తే దర్శకుడిగా ఎదగడం చాలా ఈజీ అంటూ షార్ట్ కట్ చెబుతున్నాడు. “ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలి అంటే తనకు టాలెంట్ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అవ్వాలి. అప్పుడు మాత్రమే ది బెస్ట్ సినిమా తీయగలడు. నాకు ఈ కమర్షియల్ యాంగిల్ […]
ఎవరైనా దర్శకుడు అవ్వాలంటే, అలాంటి వ్యక్తికి కచ్చితంగా ఓ క్వాలిటీ ఉండాలంటున్నాడు మారుతి. దర్శకుడిగా ఎదగాలనుకునే వ్యక్తికి మీడియేషన్ తెలిసి ఉండాలంటున్నాడు. ఇటు ప్రేక్షకుడికి, అటు నిర్మాతకు మధ్య సరిగ్గా మీడియేషన్ చేస్తే దర్శకుడిగా ఎదగడం చాలా ఈజీ అంటూ షార్ట్ కట్ చెబుతున్నాడు.
“ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలి అంటే తనకు టాలెంట్ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అవ్వాలి. అప్పుడు మాత్రమే ది బెస్ట్ సినిమా తీయగలడు. నాకు ఈ కమర్షియల్ యాంగిల్ లో బడ్జెట్ లో సినిమా చేయడం ఎందుకు వచ్చిందంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆడియన్స్ ఏ సినిమాలు చూస్తున్నారు, దేనికి లేచి వెళ్లిపోతున్నారు అనేది నాకు తెలుసు.
ఈ పల్స్ అందరూ తెలుసుకోవాలి. నేను చాలా గొప్ప సినిమా తీశాను అనుకుంటాడు ఏ దర్శకుడైనా. కానీ ఆడియన్స్ కు నచ్చదు. ప్రేక్షకుడు ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలియనప్పుడు ఆడియన్ కు మనకు సింక్ పోతుంది. మనం ఏ జోనర్ సినిమా తీసినా ఆడియన్ ఏం కోరుకుంటాడో వారికీ ఏం కావాలో ఇస్తూ సినిమా సినిమాకు మనం ఎలా ఎదుగుతున్నాం అని చెక్ చేసుకుంటూ కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది డబ్బుతో ముడిపడి ఉంది.
కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఆడియన్ కు ఏం కావాలో ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకొని ప్రొడ్యూసర్ కు ఇవ్వాల్సిన మీడియేషన్ బాధ్యత ఒక డైరెక్టర్ దే. ఈ మీడియేషన్ కరెక్ట్ గా చేయకపోతే ఇటు నిర్మాతలు పోతారు, అటు ఆడియన్స్ పోతారు. అందుకని డైరెక్టర్ మీడియేషన్ జాబ్ ను ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి. అది తెలిస్తే సినిమా తీయొచ్చు.”
ఇలా ఓ దర్శకుడు నేర్చుకోవాల్సిన బేసిక్ పాయింట్ ను బయటపెట్టాడు మారుతి. కెరీర్ స్టార్టింగ్ నుంచి తను ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తున్నానని, భవిష్యత్తులో కూడా ఇదే పంథాలో వెళ్తానని అంటున్నాడు. అందుకే తన సినిమాలు బడ్జెట్ దాటి వెళ్లవని చెబుతున్నాడు.
తాజాగా పక్కా కమర్షియల్ అనే సినిమా తీశాడు మారుతి. ఈ సినిమా కోసం థియేటర్లలో టికెట్ రేట్లు తగ్గించారు. ఇలా తగ్గించడం వల్ల తమ సినిమా నష్టపోదని, అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే టికెట్ రేట్లు తగ్గించామని చెబుతున్నాడు మారుతి