యూత్ సినిమాను శంకరాభరణంతో పోల్చిన నిర్మాత

రీసెంట్ గా రిలీజైన సినిమా 7 డేస్ 6 నైట్స్. ఇదొక యూత్ మూవీ. లిప్ కిస్సులు, బికినీలు ఉన్నాయి. ఇలాంటి సినిమాను శంకరాభరణంతో పోల్చాడు ఈ సినిమా దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు. శంకరాభరణ లాంటి క్లాసిక్ కూడా మౌత్ టాక్ వల్లనే హిట్ అయిందని, అదే విధంగా తన సినిమా కూడా మౌత్ టాక్ తో సక్సెస్ అవుతుందని చెబుతున్నాడు. “ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం […]

Advertisement
Update:2022-06-26 12:31 IST

రీసెంట్ గా రిలీజైన సినిమా 7 డేస్ 6 నైట్స్. ఇదొక యూత్ మూవీ. లిప్ కిస్సులు, బికినీలు ఉన్నాయి. ఇలాంటి సినిమాను శంకరాభరణంతో పోల్చాడు ఈ సినిమా దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు. శంకరాభరణ లాంటి క్లాసిక్ కూడా మౌత్ టాక్ వల్లనే హిట్ అయిందని, అదే విధంగా తన సినిమా కూడా మౌత్ టాక్ తో సక్సెస్ అవుతుందని చెబుతున్నాడు.

“ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎంత కష్టం అనేది అందరికీ తెలుసు. మేం ఆ కష్టం పడ్డాం. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. ‘శంకరాభరణం’ నుంచి ఇప్పటి వరకు క్లాసిక్ సినిమాలు మౌత్ టాక్ వల్ల పెరిగాయి. మా సినిమా యూత్‌కు విపరీతంగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఈ మౌత్ టాక్ తో మేం హ్యాపీగా ఉన్నాం”

ఇలా తన సినిమాను శంకరాభరణంతో పోల్చారు నిర్మాత రాజు. సమ్మతమే, చోర్ బజార్ లాంటి 7 సినిమాలతో పాటు విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మొదటి రోజు కేవలం 8 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. రెండో రోజు నుంచి పూర్తిగా డ్రాప్ అయింది. సోమవారం నుంచి ఈ సినిమా డౌటే.

Tags:    
Advertisement

Similar News