హారర్ కామెడీలో ఇదో కొత్తరకం అంట

తెలుగు ప్రేక్షకులకు హారర్ కామెడీలు కొత్తకాదు. ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా నుంచి టాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలైంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో సినిమాలు ఈ జానర్ లో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ సినిమా కొత్తగా ఉంటుందనే చెబుతున్నారు. ఇప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా అదే చెబుతున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు పెద్ద హిట్టయింది. ఆ తర్వాతొచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ఫ్లాప్ అయింది. యూత్ ఫుల్ […]

Advertisement
Update:2022-06-26 11:23 IST

తెలుగు ప్రేక్షకులకు హారర్ కామెడీలు కొత్తకాదు. ప్రేమకథాచిత్రమ్ అనే సినిమా నుంచి టాలీవుడ్ లో ఈ ట్రెండ్ మొదలైంది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో సినిమాలు ఈ జానర్ లో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు తమ సినిమా కొత్తగా ఉంటుందనే చెబుతున్నారు. ఇప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా అదే చెబుతున్నాడు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు పెద్ద హిట్టయింది. ఆ తర్వాతొచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే సినిమా ఫ్లాప్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లు తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ సిద్ధం చేస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘కీడా కోలా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టారు. కీడా అంటే ఆరు కాళ్లు ఉన్న పురుగు, కోలా అనేది ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ పేరు. పోస్టర్‌లో సాఫ్ట్ డ్రింక్ సీసా క్యాప్ పై టైటిల్ రాసి ఉంది. డ్రింక్ కి బదులు రక్తం పొంగుతూ బయటికి రావడం పోస్టర్ లో ఆసక్తికరంగా వుంది. అలాగే పోస్టర్ లో ఒక పురుగుని కూడా గమనించవచ్చు. “మునుపెన్నడూ చూడని క్రైమ్ కామెడీని ఎక్సపీరియన్స్ చేయండి…” అని మేకర్స్ వెల్లడించారు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి పోస్టర్లు పసుపు రంగులో డిజైన్ చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘కీడా కోలా’ పోస్టర్ ని కూడా పసుపు రంగులో డిజైన్ చేయడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే బయటకొస్తాయి.

Tags:    
Advertisement

Similar News