మరో నాలుగేళ్ళకల్లా మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వెల్లువెత్తనున్న సొమ్ములు
మరో నాలుగేళ్లకు..అంటే 2026 నాటికి మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సొమ్ములంటే సొమ్ములేనట ! ఇది 4.3 ట్రిలియన్లకు పైగానే దాటవచ్చునని అంచనా. 4 .30 లక్షల కోట్ల రూపాయలని,ఇది 8.8 శాతం పెరుగుదల అని పీ డబ్ల్యు సీ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ చెబుతోంది. దేశీయ మార్కెట్ లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు మరింతగా చొచ్ఛుకుపోవడం ద్వారా డిజిటల్ మీడియా, యాడ్ వ్యవస్థలకు చెప్పలేనంత నిధులు సమకూరుతాయని ఈ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇక సంప్రదాయకమైన […]
మరో నాలుగేళ్లకు..అంటే 2026 నాటికి మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సొమ్ములంటే సొమ్ములేనట ! ఇది 4.3 ట్రిలియన్లకు పైగానే దాటవచ్చునని అంచనా. 4 .30 లక్షల కోట్ల రూపాయలని,ఇది 8.8 శాతం పెరుగుదల అని పీ డబ్ల్యు సీ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ చెబుతోంది.
దేశీయ మార్కెట్ లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు మరింతగా చొచ్ఛుకుపోవడం ద్వారా డిజిటల్ మీడియా, యాడ్ వ్యవస్థలకు చెప్పలేనంత నిధులు సమకూరుతాయని ఈ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇక సంప్రదాయకమైన మీడియా ఉండనే ఉంది. 2026 నాటికి టీవీ యాడ్ ఆదాయం 43 వేలకోట్లకు పెరుగుతుందని, అప్పుడు గ్లోబల్ గా ఇండియాను ఐదో అతి పెద్ద టీవీ యాడ్ మార్కెట్ దేశంగా మలిచే అవకాశాలున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే అమెరికా, జపాన్, చైనా, బ్రిటన్ ఇందులో వరుస స్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది అంటే 2022 లో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ ఆదాయం దాదాపు 3.14 కోట్లు కావచ్చునని ఈ సంస్థ అంచనా వేసింది. ఇది పీ డబ్ల్యు సీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్, మీడియా ఔట్ లుక్ -2022-2026 ప్రకారం 11.4 శాతం పెరుగుదల.. మరో నాలుగేళ్లకు దేశంలో ఓటీటీ వీడియో సర్వీసులు 21,031 కోట్ల పరిశ్రమగా ఎదగవచ్చు.. ఇందులో 19,973 కోట్లు సబ్ స్క్రిప్షన్ ఆధారిత సర్వీసులు కాగా ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసుల నుంచి రూ. 1,058 అని ఈ రిపోర్టు పేర్కొంది.
ఇండియాలో జనాభా పెరుగుదల, మొబైల్-ఇంటర్నెట్ వీడియో వినియోగం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఓటీటీ మార్కెట్ దూసుకుపోతోంది. ఇక 5 జీ .. ఓటీటీ వీడియో స్ట్రీమ్స్ వంటి లెటన్సీ సర్వీసులను కూడా పర్మిట్ చేస్తే ఈ రంగానికి అడ్డు ఉండదు. ఈ ఏడాది టీవీ యాడ్ ఆదాయం 35,270 కోట్లు ఉండగా మరో నాలుగేళ్లకు ఇది 43,568 కోట్లకు పెరిగే ఛాన్స్ ఉందట. ఇది 23.52 శాతం పెరుగుదల అని లెక్క కట్టారు.
2020 లో కోవిద్-19 కారణంగా ఇండియా టీవీ యాడ్ మార్కెట్ లో మాంద్యం నెలకొంది. 2019 తో పోలిస్తే ఇది 10.8 శాతం తక్కువ. కానీ ఇది తాత్కాలికమేనని తేలింది. 2021 లో దేశం తిరిగి ఆర్థికంగా పుంజుకోవడంతో ఈ సెగ్మెంట్ 32,374 కోట్లకు.. అంటే 16. 9 శాతం పెరిగినట్టు అంచనా వేశారు.
ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే.. దీని యాడ్ మార్కెట్ 2026 నాటికి 28,234 కోట్లకు పెరగవచ్చు. అలాగే మొబైల్ ఫస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ మార్కెట్ కి సంబంధించి ఇంటర్నెట్ యాడ్ మార్కెట్లో మొబైల్ రంగానిదే అధిపత్యమని ఈ నివేదిక వెల్లడించింది. 2021 లో మొత్తం రెవెన్యూలో ఇది 60.1 శాతం కాగా మరో నాలుగు సంవత్సరాలకు ఇది 69.3 శాతానికి పెరుగుతుంది.
మ్యూజిక్, రేడియో పోడ్ కాస్ట్ సెగ్మెంట్ గత ఏడాది రూ. 7,216 కోట్లు (18 శాతం) కాగా 2026 నాటికి ఇది 11, 536 కోట్లకు పెరగవచ్చునని అంచనా. ఇక వీడియో గేములు , స్పోర్ట్స్ రెవెన్యూ ఆ సంవత్సరానికి రూ. 37,535 కోట్ల మేర ఉంటుందని ఈ నివేదిక విశ్లేషించింది.
ఇండియన్ సినిమా రంగ విషయానికే వస్తే ఈ పరిశ్రమ మరో నాలుగేళ్లకు సుమారు 16,198 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించవచ్చు.. ఇందులో బాక్సాఫీసు ఆదాయం 15,849 కోట్లని, మిగతాది యాడ్స్ ద్వారా వచ్చే 349 కోట్ల రూపాయలని ఈ రిపోర్టు వివరించింది. న్యూస్ పేపర్ ఆదాయం కూడా ఇండియాలో చెప్పుకోదగినదేనని ఈ నివేదిక వివరించింది. 2025 లో ఇండియా ఈ రంగంలో చైనాను మించిపోవచ్చు.