ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఆచార్య

చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య‘. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. డిస్ట్రిబ్యూటర్లందరినీ భారీ నష్టాల్లో ముంచింది. ఒక సినిమా పెట్టుబడిలో 60 శాతం కంటే ఎక్కువ నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నిర్మాతలు, హీరోలు.. పంపిణీదారులకు డబ్బును తిరిగి ఇవ్వడం టాలీవుడ్ లో కామన్ గా జరిగే పద్ధతి. అయితే ఆచార్య విషయంలో ఇప్పటివరకు అలా జరగలేదు. ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదలైంది. రిలీజైన […]

Advertisement
Update:2022-06-21 11:43 IST

చిరంజీవి, రామ్ చరణ్‌ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య‘. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. డిస్ట్రిబ్యూటర్లందరినీ భారీ నష్టాల్లో ముంచింది. ఒక సినిమా పెట్టుబడిలో 60 శాతం కంటే ఎక్కువ నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నిర్మాతలు, హీరోలు.. పంపిణీదారులకు డబ్బును తిరిగి ఇవ్వడం టాలీవుడ్ లో కామన్ గా జరిగే పద్ధతి. అయితే ఆచార్య విషయంలో ఇప్పటివరకు అలా జరగలేదు.

‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న విడుదలైంది. రిలీజైన మొదటి రోజే సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత ఏ దశలోనూ సినిమా కోలుకోలేదు. దీంతో బయ్యర్లకు నష్టాలు తప్పలేదు. ఈ నష్టాన్ని కొంత భరించడానికి చిరు-చరణ్ ముందుకొచ్చారు. తమ రెమ్యూనరేషన్లలో కొంత వెనక్కి ఇవ్వడానికి అంగీకరించారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం టీమ్ నుంచి ఇంకా ఎలాంటి డబ్బులు అందుకోలేదు.

దీనికి ప్రధాన కారణం దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి. వాళ్లు అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ దక్కించుకుంది. అగ్రిమెంట్ లో అనుకున్న తేదీ కంటే ముందే సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి కూడా నిర్మాత అంగీకరించారు. ఆ మేరకు కొంత అదనపు మొత్తం ఇవ్వడానికి అమెజాన్ ఒప్పుకుంది. కానీ ఇప్పటివరకు మేకర్స్ కు అమెజాన్ నుండి డబ్బు అందలేదు. ఆ డబ్బు వస్తే నష్టపరిహారం మొదలుపెట్టాలని నిర్మాత అనుకుంటున్నాడట.

వచ్చే వారం ఈ మొత్తం వ్యవహారాన్ని క్లియర్ చేయడానికి కొరటాల శివ ఏర్పాట్లు చేస్తున్నాడని టాక్. ‘ఆచార్య’ సెటిల్ మెంట్స్ పూర్తయిన తర్వాతే, ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడు కొరటాల. తాజా సమాచారం ప్రకారం ఆచార్య సెటిల్ మెంట్స్ ఈ నెలాఖరులోగా పూర్తవుతాయి.

Tags:    
Advertisement

Similar News