సినిమా టికెట్ రేట్లపై ఆర్జీవీ విశ్లేషణ ఏంటి?
తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య సినిమా టికెట్ రేట్లు పెంచారు. భారీ సినిమాలకు భారీ రేట్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా టికెట్ రేట్లు తగ్గించారు. ప్రభుత్వం చెప్పిన కనీస ధర కంటే తక్కువగా టికెట్ రేట్లు పెట్టి మరీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని ఆహ్వానిస్తున్నారు మేకర్స్. అయినప్పటికీ థియేటర్లకు ఫుట్ ఫాల్ పెరగడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. “పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది […]
తెలుగు రాష్ట్రాల్లో ఆమధ్య సినిమా టికెట్ రేట్లు పెంచారు. భారీ సినిమాలకు భారీ రేట్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఊహించని విధంగా టికెట్ రేట్లు తగ్గించారు. ప్రభుత్వం చెప్పిన కనీస ధర కంటే తక్కువగా టికెట్ రేట్లు పెట్టి మరీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని ఆహ్వానిస్తున్నారు మేకర్స్. అయినప్పటికీ థియేటర్లకు ఫుట్ ఫాల్ పెరగడం లేదు. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
“పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. అదొక సైకిల్. నాలుగు నెలల క్రితం టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్ళీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు.”
ఇలా టికెట్ రేట్ల పెంపు-తగ్గింపుపై తనదైన శైలిలో స్పందించాడు వర్మ. ఓ సినిమాకు డిమాండ్ ఉన్నప్పుడు టికెట్ రేటు పెంచుతారని, డిమాండ్ లేనప్పుడు సాధారణ టికెట్ రేట్లు ఉంచుతారని, సినిమాకు అస్సలు బజ్ లేనప్పుడు ఇంకా రేట్లు తగ్గిస్తారని అన్నాడు.
కొండా సినిమాతో త్వరలోనే థియేటర్లలోకి వస్తున్న రామ్ గోపాల్ వర్మ, తన సినిమా కోసం కొంతమంది ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. తన సినిమాకు టికెట్ రేట్లు ఎలా ఉంటాయనేది తన పరిథిలో అంశం కాదని, అది తన నిర్మాతలు నిర్ణయించుకుంటారని అన్నాడు.