చంద్రముఖి -2 వచ్చేస్తోంది..హీరో ఎవరంటే..!

2005లో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ చంద్రముఖి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బంపర్ హిట్ గా నిలిచింది. కొన్నేళ్లపాటు సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సినిమా భారీ విజయాన్ని కట్టబెట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతం గా నిలిచింది. ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నయనతార నటించగా, చంద్రముఖి ఆవహించిన మహిళగా జ్యోతిక అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు ఇది వరకే ప్రీక్వెల్ గా వెంకటేష్ […]

Advertisement
Update:2022-06-16 10:58 IST
#chandramukhi-2, #raghavalaurence, #release, #comesoon
  • whatsapp icon

2005లో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ చంద్రముఖి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బంపర్ హిట్ గా నిలిచింది. కొన్నేళ్లపాటు సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సినిమా భారీ విజయాన్ని కట్టబెట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విజయవంతం గా నిలిచింది. ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నయనతార నటించగా, చంద్రముఖి ఆవహించిన మహిళగా జ్యోతిక అద్భుతంగా నటించింది. ఈ సినిమాకు ఇది వరకే ప్రీక్వెల్ గా వెంకటేష్ హీరోగా నాగవల్లి అనే సినిమా వచ్చింది.

ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి-2వస్తోంది. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన పి. వాసు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది.

ఇందులో హీరోగా రాఘవ లారెన్స్ నటించనున్నారు. మరో ముఖ్య పాత్రను వడివేలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. చంద్రముఖి గది తలుపులు నిండా తాయేత్తులతో కట్టి ఉన్న పోస్టర్ ఆసక్తి రేపుతోంది. మరి ఈ సినిమా కూడా చంద్రముఖి లాగా సెన్సేషన్ సృష్టిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News