టాలీవుడ్ లో మరోసారి సమ్మె సైరన్?

ఇప్పుడిప్పుడే గాడిన పడింది టాలీవుడ్. కరోనా నుంచి సక్సెస్ ఫుల్ గా కోలుకుంది. ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీలో సమ్మె సైరన్ మోగితే కష్టమే. వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. కానీ టాలీవుడ్ లో సమ్మె ఛాయలు కనిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు సమ్మె సైరన్ మోగించే ప్రమాదం ఉంది. ఫిలిం ఫెడరేషన్ లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. కరోనా వల్ల […]

Advertisement
Update:2022-06-14 12:12 IST

ఇప్పుడిప్పుడే గాడిన పడింది టాలీవుడ్. కరోనా నుంచి సక్సెస్ ఫుల్ గా కోలుకుంది. ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీలో సమ్మె సైరన్ మోగితే కష్టమే. వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. కానీ టాలీవుడ్ లో సమ్మె ఛాయలు కనిపిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు సమ్మె సైరన్ మోగించే ప్రమాదం ఉంది.

ఫిలిం ఫెడరేషన్ లోని 24 క్రాఫ్టుల్లో జీతాలు పెంచాల్సి ఉంది. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. కరోనా వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. ఇప్పుడంతా గాడిన పడినప్పటికీ, వేతనాల పెంపుపై నిర్మాతలు నోరుమెదపడం లేదు. దీంతో వెంటనే జీతాలు పెంచకపోతే, జులై 1 నుంచి 24 విభాగాలకు చెందిన కార్మికులు సమ్మె బాట పట్టే ప్రమాదం ఉంది.

దీనికి సంబంధించి ఈరోజు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కీలక సమావేశం నిర్వహించారు. సినీ కార్మికుల వేతనాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే దీనిపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎంప్లాయిస్ ఫెడరేషన్ తో తమ పాత ఒప్పందాల్ని పైకి తెస్తున్నారు. గతంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్లను ఫిలిం ఫెడరేషన్ అమలు చేయలేదని, అలాంటప్పుడు ఇప్పుడెలా వేతనాల పెంపు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు.

దీంతో వ్యవహారం ముదిరి పాకానపడింది. ఒక దశలో, కార్మికులు సమ్మె చేసినా తమ సినిమాలకొచ్చిన నష్టం లేదని కొంతమంది నిర్మాతలు వాదించినట్టు తెలుస్తోంది. మరోవైపు కార్మికుల దినోత్సవం రోజున కూడా షూటింగ్ లు పెట్టి హింసించారని, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. చిరంజీవి, దిల్ రాజు లాంటి పెద్దమనుషులు చొరవ తీసుకొని ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయకపోతే.. ఏ క్షణానైనా కార్మికులు సమ్మె బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News