విక్రమ్ హిట్ : లోకేశ్ కి లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన కమల్..!

విశ్వనటుడు కమల్ హాసన్ కు ఎట్టకేలకు విజయాల కొరత తీరింది. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం విడుదలైన దశావతారం కమల్ హాసన్ కి చివరి సూపర్ హిట్. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా గెలుపు రుచి ఆస్వాదించలేదు. మధ్యలో మలయాళ దృశ్యం, దృశ్యం-2 సినిమాలను కోలీవుడ్ లో కమల్ రీమేక్ చేశారు. అయితే ఆ సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ గా నిలవలేక పోయాయి. భారీ బడ్జెట్ […]

Advertisement
Update:2022-06-08 03:34 IST

విశ్వనటుడు కమల్ హాసన్ కు ఎట్టకేలకు విజయాల కొరత తీరింది. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం విడుదలైన దశావతారం కమల్ హాసన్ కి చివరి సూపర్ హిట్. ఆ తర్వాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా గెలుపు రుచి ఆస్వాదించలేదు. మధ్యలో మలయాళ దృశ్యం, దృశ్యం-2 సినిమాలను కోలీవుడ్ లో కమల్ రీమేక్ చేశారు. అయితే ఆ సినిమాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం హిట్ గా నిలవలేక పోయాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన విశ్వరూపం, విశ్వరూపం 2, ఉత్తమ విలన్ వంటి చిత్రాలు కూడా కమల్ హాసన్ ను నిరుత్సాహ పరిచాయి.

ఈ నేపథ్యంలో తన అభిమాని అయిన యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాలో కమల్ హాసన్ నటించాడు. ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అతిథి పాత్రలో ప్రముఖ నటుడు సూర్య నటించాడు. జూన్ 3వ తేదీన విడుదలైన ఈ సినిమా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

దీంతో ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కమల్ కు విజయం దక్కింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడికి కమల్ హాసన్ ఒక ఖరీదైన లగ్జరీ కారును బహుమానంగా అందజేశాడు. ఈ కారు ధర సుమారు రూ.60 లక్షల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కారుతో పాటు లోకేశ్ ను అభినందిస్తూ కమల్ హాసన్ ఒక ఎమోషనల్ లెటర్ కూడా అందజేశాడు. ఈ లెటర్ తనకు ‘లైఫ్ టైం సెటిల్మెంట్ లెటర్’ గా డైరెక్టర్ లోకేశ్ చెప్పుకొచ్చాడు.

Also Read : సెట్స్ పైకొచ్చిన జేజీఎం

Tags:    
Advertisement

Similar News