విరాటపర్వం ట్రయిలర్ రివ్యూ

రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్ , ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. నక్సల్ ఉద్యమం నేపధ్యంలో […]

Advertisement
Update:2022-06-07 09:23 IST
రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్ , ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. నక్సల్ ఉద్యమం నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమకథని తెరపై ఆవిష్కరించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

కామ్రేడ్ రావన్న పాత్రలో రానా నటన అవుట్ స్టాండింగ్ గా వుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు..’ అనే రానా డైలాగ్ తో మొదలైన ట్రైలర్ .. ”ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల ఇది నా కథ” అని వెన్నెల పాత్ర చెప్పిన డైలాగ్ తో ముగించడం ఆసక్తిగాకరంగా వుంది.

అలాగే ”ఇక్కడ రాత్రుండ‌దు.. ప‌గ‌లుండ‌దు.. ఉన్నతంతా ఊపిరి ఊపిరికి మ‌ధ్య ఊపిరి స‌ల‌ప‌నంత యుద్ధం మాత్రమే”, ”తుపాకీ గొట్టంలో శాంతి లేదు, ఆడపిల్ల ప్రేమలో వుంది”. ‘రక్తపాతం లేనిదెక్కడ?.. మనిషి పుట్టుకలోనే ఉంది” డైలాగ్స్ కూడా ఫవర్ ఫుల్ గా ఆకట్టుకున్నాయి. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం, డానీ సాంచెజ్ లోపెజ్‌ కెమారా పనితనం, నిర్మాణ విలువలు, శ్రీకార్ ప్రసాద్ ఎడిటింగ్ అత్యున్నత స్థాయిలో వున్నాయి. ఈ ట్రైలర్ విరాటపర్వంపై భారీ అంచనాలు పెంచింది.

Full View

Tags:    
Advertisement

Similar News