ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిన వెంకీ
కొన్ని ప్రాంతాలు కొందరికి సెంటిమెంట్ గా మారతాయి. ఉదాహరణకు సూపర్ స్టార్ కృష్ణనే తీసుకుంటే, తన ప్రతి సినిమాను ఆయన ఊటీలో షూట్ చేస్తారు. అలాగే చాలామంది హీరోలకు వైజాగ్ సెంటిమెంట్. విశాఖలో కనీసం ఒక్క సీన్ అయినా షూట్ చేస్తారు. వెంకటేష్ కు కూడా విశాఖ సెంటిమెంట్ ఉంది. విశాఖలో ఎఫ్3 ఫంక్షన్ లో పాల్గొన్న వెంకీ, గతంలోకి జారుకున్నారు. తన గత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎఫ్3 వరకు విశాఖతో […]
కొన్ని ప్రాంతాలు కొందరికి సెంటిమెంట్ గా మారతాయి. ఉదాహరణకు సూపర్ స్టార్ కృష్ణనే తీసుకుంటే, తన ప్రతి సినిమాను ఆయన ఊటీలో షూట్ చేస్తారు. అలాగే చాలామంది హీరోలకు వైజాగ్ సెంటిమెంట్. విశాఖలో కనీసం ఒక్క సీన్ అయినా షూట్ చేస్తారు. వెంకటేష్ కు కూడా విశాఖ సెంటిమెంట్ ఉంది.
విశాఖలో ఎఫ్3 ఫంక్షన్ లో పాల్గొన్న వెంకీ, గతంలోకి జారుకున్నారు. తన గత జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎఫ్3 వరకు విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
“వైజాగ్ అంటే నాకు చాలా స్పెషల్. నా మొదటి సినిమా కలియుగ పాండవులు ఇక్కడే చేశాను. స్వర్ణ కమలం, గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో, మల్లీశ్వరి, గురు ఇలా చాలా సినిమాలు ఇక్కడ చేశాను. ఇక్కడ ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు మంచి స్క్రిప్ట్ తో వచ్చారు. మీరు గొప్ప విజయాన్ని అందించారు. నారప్ప, దృశ్యం ఓటీటీ కి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అందుకే ఎఫ్ 3లో నారప్ప గెటప్ లో వచ్చి ఫ్యాన్స్ ని థ్రిల్ చేయాలనీ అనుకున్నాను. ఈ చిత్రానికి పని చేసిన టెక్నికల్ టీంకి, ఆర్టిస్ట్ లకి అందరికీ థాంక్స్. ఈ ఈవెంట్ లో లేడి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉండటం ఆనందంగా ఉంది.”
ఇలా విశాఖతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వెంకటేశ్. రాబోయే రోజుల్లో తన ప్రతి సినిమా షూట్ కోసం విశాఖ వస్తానని అంటున్నారు వెంకటేశ్. తనకు విశాఖలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందన్నారు వెంకీ.