సినిమా కథను తలకిందులు చేస్తాడట
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో సాయిపల్లవిదే లీడ్ రోల్. రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్ర పోషించాడు. తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. సినిమాను తలకిందులు చేసే పాత్రలో తను నటించానని అంటున్నాడు ఈ హీరో. “ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో, ట్విస్ట్ ఇవ్వడమో లాంటివే చేశాను. కానీ విరాటపర్వం లో మాత్రం పూర్తికథనే తలకిందులు చేసే పాత్రలో […]
రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా విరాటపర్వం. ఈ సినిమాలో సాయిపల్లవిదే లీడ్ రోల్. రానా నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. ఇందులో నవీన్ చంద్ర ఓ కీలకమైన పాత్ర పోషించాడు. తన క్యారెక్టర్ గురించి చెబుతూ.. సినిమాను తలకిందులు చేసే పాత్రలో తను నటించానని అంటున్నాడు ఈ హీరో.
“ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు కథలో చిన్న మార్పు తేవడమో, ట్విస్ట్ ఇవ్వడమో లాంటివే చేశాను. కానీ విరాటపర్వం లో మాత్రం పూర్తికథనే తలకిందులు చేసే పాత్రలో కనిపిస్తా. ఇందులో నా పాత్ర పేరు రఘన్న. సినియర్ ఉద్యమకారుడిగా కనిపిస్తా. ఉద్యమం తప్ప దేన్నీ లెక్కచేయను. ఎలాంటి ఎమోషన్ కి లొంగను. ఈ కారణంతోనే గ్రూప్ లో సీనియర్ గా గుర్తింపు దక్కాల్సిన నా పాత్ర జూనియర్ ఉద్యమకారుడిగా ఉండిపోతుంది. ఆ ఈర్ష్య కూడా నా పాత్రలో కనిపిస్తుంది.”
ఇలా సినిమాలో తన పాత్ర ఛాయల్ని వెల్లడించాడు నవీన్ చంద్ర. ఈ సినిమాలో కేవలం ఉద్యమం మాత్రమే ఉండదని, అంతకంటే ఎక్కువగా ఓ గొప్ప ప్రేమకథ ఉంటుందని చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర.
విరాటపర్వం కోసం చాలా కష్టపడ్డాడట నవీన్ చంద్ర. అయినప్పటికీ ఎంతో ఇష్టంగా చేశాడట. దర్శకుడు వేణు, కొత్తకథని బలమైన పాత్రలతో చెప్పే ప్రయత్నం చేశాడని, ఇందులో చాలా మంచి పాత్ర తనకు దక్కిందని అంటున్నాడు. ఈ సినిమాలో దాదాపు 35 నిమిషాల పాటు నవీన్ చంద్ర పాత్ర ఉంటుందట.