బంగ్లా అమ్మాయి…భారత్ అబ్బాయి పెళ్లికోసం నదినే ఈదిన యువతి
పేస్ బుక్ ప్రేమలు నేటితరం యువతతో గొప్పగొప్ప సాహసాలే చేయిస్తున్నాయి. ప్రేమను పెళ్లి గా మార్చుకోడం కోసం యువకులే చొరవ తీసుకోడం, సాహాసాలు చేయడం సాధారణ విషయం. అయితే రొటీన్ కు భిన్నంగా బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి..భారత్ లోని తన ప్రియుడి కోసం గొప్పసాహసమే చేసింది. ప్రాణాలకు తెగించి మరీ తమ దేశానికి సరిహద్దుగా ఉన్న నదినే గంటపాటు ఈది భారత్ సరిహద్దులోని ఒడ్డుకు చేరింది. సినిమా కథను మించే పోయే ఈ […]
పేస్ బుక్ ప్రేమలు నేటితరం యువతతో గొప్పగొప్ప సాహసాలే చేయిస్తున్నాయి. ప్రేమను పెళ్లి గా మార్చుకోడం కోసం యువకులే చొరవ తీసుకోడం, సాహాసాలు చేయడం సాధారణ విషయం. అయితే రొటీన్ కు భిన్నంగా బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల యువతి..భారత్ లోని తన ప్రియుడి కోసం గొప్పసాహసమే చేసింది.
ప్రాణాలకు తెగించి మరీ తమ దేశానికి సరిహద్దుగా ఉన్న నదినే గంటపాటు ఈది భారత్ సరిహద్దులోని ఒడ్డుకు చేరింది.
సినిమా కథను మించే పోయే ఈ ప్రేమకథలోకి వెళితే…
ప్రాణాలకు తెగించి….
కోల్ కతా నగరానికి ఆవలి ఒడ్డునే ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన కృష్ణ మండల్ అనే యువతికి అభిషేక్ మండల్ అనే భారత యువకుడితో పేస్ బుక్ ద్వారా పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని బంగ్లా అమ్మాయి, భారత్ అబ్బాయి అనుకొన్నారు. అయితే..ఇద్దరికీ పాస్ పోర్టులు లేకపోడంతో ఏం చేయాలో పాలుపోలేదు.
కోల్ కతా కుర్రోడు అభిషేక్ తటపటాయిస్తుంటే…బంగ్లా కుర్రది కృష్ణ మండల్ మాత్రం ప్రాణాలకు తెగించింది. భారత్ తీరంలోని కోల్ కతా నగరం చేరాలంటే ..మనుషులను తినే పులులు సంచరించే సుందర్ బన్ అడవుల తీరంలోని నదిని ఈదాలాని నిర్ణయించుకొంది. మొసళ్లు, పులులు సంచరించే ఆ నదిలో గంటపాటు. ఈత కొట్టి మరీ భారత్ వైపు ఒడ్డుకు చేరి తన ప్రియుడిని కలిసింది.
4రోజుల క్రితమే పెళ్లి..ఆ వెంటనే అరెస్టు…
సుందర్ బన్స్ నదిని ఈది భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన కృష్ణ మండల్ కోల్ కతాలోని కాళీమందిరంలో తన ప్రియుడు అభిషేక్ మండల్ ను పెళ్లాడింది.
అయితే…ఈ విషయం తెలిసిన ఆ ప్రాంత పోలీసులు..భారత్ కోడలిగా మారిన కృ్ష్ణను అదుపులోకి తీసుకొన్నారు.
భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఆ యువతిని బంగ్లా అధికారులతో మాట్లాడి వారిదేశానికి పంపేయాలని భావిస్తున్నారు.
గతంలో తనకు ఇష్టమైన చాక్ లెట్ కోసం ఓ బంగ్లా టీనేజర్ ఇమాన్ హుస్సేన్ నదిని ఈది అక్రమంగా భారత్ లోకి ప్రవేశించడంతో సరిహద్దు పోలీసులు అరెస్టు చేసి..ఆ దేశానికి తిప్పి పంపారు.
భారత్- బంగ్లాదేశ్ ల మెధ్య ఎక్కువభాగం సరిహద్దుగా నదులే ఉండటంతో భారత్ లోకి అక్రమ చొరబాట్లు, ప్రవేశాలు తరచూ చోటు చేసుకొంటున్నాయి.
ALSO READ : హిజాబ్ గొడవతో చదువుకి దూరమవుతున్న ముస్లిం విద్యార్థినులు