టార్గెట్ రీచ్ అయ్యాం అంటున్న దర్శకుడు
ఎఫ్3తో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యానంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. తాము ఏదైతే ఉహించామో, సరిగ్గా అదే రిజల్ట్ ప్రేక్షకుల నుంచి వచ్చిందని చెబుతున్నాడు. తాజాగా 3 రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనీల్.. కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎఫ్3 సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారని ప్రకటించాడు. “రెండేళ్ళ నాడు ఎఫ్3 మొదలుపెట్టినప్పుడు థియేటర్ లో అందరూ పిల్లలతో సహా కుటుంబం నవ్వుతుంటే థియేటర్ లో […]
ఎఫ్3తో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యానంటున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. తాము ఏదైతే ఉహించామో, సరిగ్గా అదే రిజల్ట్ ప్రేక్షకుల నుంచి వచ్చిందని చెబుతున్నాడు. తాజాగా 3 రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనీల్.. కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులు పూర్తిస్థాయిలో ఎఫ్3 సినిమా కోసం థియేటర్లకు వస్తున్నారని ప్రకటించాడు.
“రెండేళ్ళ నాడు ఎఫ్3 మొదలుపెట్టినప్పుడు థియేటర్ లో అందరూ పిల్లలతో సహా కుటుంబం నవ్వుతుంటే థియేటర్ లో స్పీకర్లు దద్దరిల్లాలని అనుకున్నాం. ఇప్పుడు అదే జరిగింది. పాండమిక్ వచ్చాక అందరూ థియేటర్ కు దూరమయ్యాం. ఆర్ఆర్ఆర్ అందుకు ఊపిరిపోసింది. ఎఫ్3తో మరలా అందరూ థియేటర్ కు రావడం చూస్తుంటే మాకు ఎనర్జీ వచ్చింది. వెంకటేష్, వరుణ్ సంక్రాంతి అల్లుళ్ళగా ఎఫ్2 తో మీ ముందుకు వస్తే, సమ్మర్ సోగ్గాళ్ళుగా ఇప్పుడు ఎఫ్3 తో వచ్చారు. మీరు హిట్ ఇచ్చారు. సినిమాను మళ్ళీ మళ్ళీ చూడండి కుటుంబంతో చూడండి. నేను టార్గెట్ చేసింది మిమ్మల్ని నవ్వించడానికే. టార్గెట్ రీచ్ అయ్యాం. కలెక్షన్ల పరంగా చాలా హ్యాపీగా వున్నాం. దిల్‌రాజుగారు ఆ జోష్ తోనే అమెరికా వెళ్ళారు.”
ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు అనీల్ రావిపూడి. కొంతమందికి సినిమా నచ్చలేదనే విమర్శలపై కూడా స్పందించాడు. ఎఫ్2 సినిమా కూడా కొంతమందికి నచ్చలేదని, కానీ బ్లాక్ బస్టర్ అయిందని గుర్తు చేశాడు. అందరికీ నచ్చాలనే రూల్ లేదని, ఎఫ్3 కూడా పెద్ద హిట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.