గులాబీకి గుడ్‌ బై లిస్ట్‌ రెడీ అయిందా?

ముందస్తు ఎన్నికల ముచ్చట ఉందో.. లేదో తెలియదు. కానీ తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ముందస్తు సందడి మొదలైంది. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి సై అనేందుకు నేతలు రెడీ అయ్యారు. ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రిపరేషన్‌ మొదలెట్టారు. అందులో భాగంగా కొందరు గోడ మీద పిల్లిలా ఏ పార్టీలో చేరాలా? అని ఆలోచిస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇటీవలే చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు నల్లాల ఓదెలు గుడ్‌ […]

Advertisement
Update:2022-05-23 04:13 IST

ముందస్తు ఎన్నికల ముచ్చట ఉందో.. లేదో తెలియదు. కానీ తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ముందస్తు సందడి మొదలైంది. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన పోటీకి సై అనేందుకు నేతలు రెడీ అయ్యారు. ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల ప్రిపరేషన్‌ మొదలెట్టారు. అందులో భాగంగా కొందరు గోడ మీద పిల్లిలా ఏ పార్టీలో చేరాలా? అని ఆలోచిస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇటీవలే చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌కు నల్లాల ఓదెలు గుడ్‌ బై చెప్పారు. ఆయన బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 103 చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు లేదా నలుగురు నేతలు ఉన్నారు. ఇద్దరు బలమైన నేతలు ఉంటే వారి మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో టికెట్‌ రాకుంటే ఏంటి? అనే పరిస్థితి అని ఇప్పుడు నేతలు ఆలోచిస్తున్నారు. సిట్టింగ్‌లు కాదని తమకు టికెట్‌ ఇవ్వకపోతే ఏం చేయాలి? కాంగ్రెస్‌లో చేరాలా? బీజేపీ వైపు నడవలా? అని లెక్కలు వేస్తున్నారట.

నల్లాల ఓదెలు బాటలోనే మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ కోవా లక్ష్మితో పాటు తుమ్మల నాగేశ్వరరావు నడుస్తారని ప్రచారం జరుగుతోంది. దాదాపు 40కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠ నెలకొంది.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈటలతో పాటు బీజేపీలో చేరిన ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం నడుస్తోంది. అన్నీ లెక్కలు కుదిరితే ఆయన కాంగ్రెస్‌లో కూడా చేరుతారనేది ఓ మాట. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పోటీకి ఎర్రబెల్లి అల్లుడు మదన్‌మోహన్‌రావు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో జహీరాబాద్‌ ఎంపీగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. అయితే ఇక్కడ కాంగ్రెస్ టికెట్‌ కోసం సుభాష్‌రెడ్డి లైన్‌లో ఉన్నారు. వీరి మధ్య ఆధిపత్య పోరుతో ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు మారితే మదన్‌మోహన్‌ రావు టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. ఆయన గులాబీ గూటికి చేరితే.. ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరొచ్చనేది ఓ ప్రచారం. ఇలా ప్రతి నియోజకవర్గంలో నేతలు జంప్‌తో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News