టాలీవుడ్ లో పని పూర్తిచేసిన హన్సిక

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకేఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మొత్వాని హీరోయిన్. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. తాజాగా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు యూనిట్ […]

Advertisement
Update:2021-08-10 11:38 IST

ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకేఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా
సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మొత్వాని హీరోయిన్. ”సింగిల్
షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. తాజాగా షూటింగ్
పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు యూనిట్ రెడీ అవుతోంది. నిన్న హీరోయిన్ హన్సిక పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. 30వ ఏట ఆమె అడుగు పెట్టింది. ఈ సందర్భంగా “105 మినిట్స్” చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హPostన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

ఈ సినిమాపై హన్సిక చాలా హోప్స్ పెట్టుకుంది. యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రల్ని సెలక్ట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ.. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్ర పోషించలేదు. షూటింగ్ కు తక్కువ రోజులే టైమ్ పట్టినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్, కొత్త స్క్రీన్ ప్లే కావడంతో చాలా కష్టపడ్డానని తెలిపింది ఈ ఆపిల్ బ్యూటీ. ఈ మూవీతో తెలుగులో మరోసారి తనకు క్రేజ్ రావడం గ్యారెంటీ అంటోంది.

Tags:    
Advertisement

Similar News